
Gongura Leaves Benefits: గోంగూరలో ఖనిజాలు పుష్కలం ఇందులో విటమిన్ ఏ, సీ, కే, బీ ఉంటాయి. అంతేకాదు ఇందులోని ఖనిజాలు అయిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మన శరీరానికి ఎంతో ముఖ్యం. గోంగూరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. గోంగూర ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుంది.
గోంగూర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. దీంతో ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా దూరంగా ఉంటాం. అదనంగా గోంగూరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇది ఆర్థరైటీస్ సమస్యను తగ్గిస్తుంది నొప్పుల సమస్యలు కూడా మీ దరిచేరవు.
రక్తంలో చక్కెర స్థాయిలను కూడా గోంగూర నిర్వహిస్తుంది. ఇందులో పొటాషియం ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతూలం చేస్తుంది. హైపర్‌టెన్షన్ సమస్యను కూడా తగ్గిస్తుంది. గోంగూర ఆకులు బ్లడ్ ప్రెజర్ స్థాయిలను కూడా నిర్వహిస్తుంది. ఇందులో విటమిన్ సీ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. సీజనల్ జబ్బుల నుంచి మనల్ని ఈ విటమిన్ కాపాడుతుంది.
గోంగూరో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ. ఇది కడుపు నిండిన అనుభూతిని కూడా కల్పిస్తుంది. గోంగూర రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. దీంతో వెజ్, నాన్ వెజ్ వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చు. పోషకాలకు పవర్‌హౌస్ అయిన గోంగూర తింటే ఇందులో పోషకకాలు పుష్కలం. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కావాలంటే ఈ ఆకుకూరను మీ డైట్లో తప్పనిసరి చేర్చుకోండి. ప్రధానంగా ఐరన్ లేమితో బాధపడుతున్న మహిళలు గోంగూరను తప్పకుండా తినాలి. దీంతో గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, మటన్ కూడా తయారు చేసుకుని తింటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook