Hair Care Remedies: మెంతుల్లో ఇది కలిపి రాస్తే చాలు హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ సమస్యకు చెక్

Hair Care Remedies: ఆధునిక జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ముఖ్యమైంది కేశాల సమస్య. హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ వంటివి పెద్ద సమస్యగా మారాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2025, 11:34 PM IST
Hair Care Remedies: మెంతుల్లో ఇది కలిపి రాస్తే చాలు హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ సమస్యకు చెక్

Hair Care Remedies: ఆధునిక జీవన శైలిలో ప్రధాన సమస్య కేశాలకు సంబంధించింది. సరైన ఆహారం లేకపోవడం, కాలుష్యం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల జుట్టు రాలిపోవడం, త్వరగా తెల్లబడటం జరుగుతోంది. మార్కెట్ లో వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా దుష్పరిణామాలే తప్ప శాశ్వత పరిష్కారం ఉండటం లేదు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు.

Add Zee News as a Preferred Source

ప్రతి అమ్మాయి కోరుకునేది అందమైన, ఆరోగ్యమైన జుట్టు. మార్కెట్‌లో లభించే ఉత్పత్తులపై ఆధారపడకుండా ప్రతి వంటింట్లో లభించే ఈ పదార్ధంతో చాలా సులభంగా కేశాలను సంరక్షించుకోవచ్చు. దీనివల్ల జుట్టు ఎత్తుగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ నియంత్రించవచ్చు. అవే మెంతులు. ఇందులో ప్రోటీన్లు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే నికోటిన్ జుట్టు మూలాలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. ఇందులో ఉండే ఐరన్ కారణంగా హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను అద్భుతంగా నియంత్రిస్తాయి.

ఉల్లిపాయ కూడా కలిపి రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫర్ కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కేశాలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. ఉల్లిలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం కేశాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే మెంతులు, ఉల్లిపాయలు కలిపి మాస్క్ తయారు చేసి రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన మెంతుల్ని ఉదయం ఉల్లిరసంతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి మస్సాజ్ చేయాలి. ఓ అరగంట ఉంచి తరువాత లైట్ షాంపూతో స్నానం చేయాలి. 

ముందు మెంతుల్ని నానబెట్టి తరువాత మరిగించాలి. ఆ తరువాత వడగట్టాలి. దీనికి ఉల్లిరసం చేర్చాలి. ఈ రెండూ కలిపిన మిశ్రమం పట్టించి నీళ్లతో శుభ్రం చేయాలి. మెంతులు, ఉల్లిపాయలతో కలిపి చేసిన నూనెను క్రమం తప్పకుండా తలకు రాయడం వల్ల ఒత్తుగా పెరుగుతుంది. 

Also read: Supreme Court: వక్ఫ్ చట్టంపై కీలక పరిణామాలు, ఇస్లాంలో భాగం కాదు అది

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News