Brown Rice: బ్రౌన్‌రైస్‌ రెగ్యులర్‌గా తింటే ఈ 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Brown Rice Health Benefits: బ్రౌన్‌ రైస్‌ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల  ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రౌన్‌ రైస్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. బ్రౌన్‌ రైస్‌ రెగ్యులర్‌గా తినడం వల్ల కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Written by - Renuka Godugu | Last Updated : Mar 15, 2025, 01:52 PM IST
Brown Rice: బ్రౌన్‌రైస్‌ రెగ్యులర్‌గా తింటే ఈ 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

Brown Rice Health Benefits: తెల్ల బియ్యంలో కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. కాబట్టి బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. రెగ్యులర్‌గా మీ డైట్‌లో బ్రౌన్‌ రైస్‌ చేర్చుకుంటే పది ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రైస్‌తో మీరు బరువు కూడా సులభంగా తగ్గిపోతారు. దీంతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉంటాయి. బ్రౌన్‌ రైస్‌ రెగ్యులర్‌గా తినడం వల్ల కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Add Zee News as a Preferred Source

బ్రౌన్‌ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఫాస్పరస్‌, విటమిన్‌ బీ ఉంటాయి. మన ఆరోగ్యకరమైన శరీరానికి ఇవి ఎంతో అవసరం.
బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్‌ రక్తంలో చక్కెరను మెల్లిగా కలిసేలా చేస్తుంది. షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు బ్రౌన్‌ రైస్‌ తినాలి.

అంతేకాదు బ్రౌన్‌ రైస్‌లో ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. బ్రౌన్‌ రైస్‌ దీర్ఘకాలిక మలబద్ధక సమస్య, హెమరైడ్స్‌ అభివృద్ధిని తగ్గిస్తుంది.

మన రెగ్యులర్‌ డైట్‌లో బ్రౌన్‌ రైస్‌ ఉంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, అధిక మోతాదులో ఫైబర్‌ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. దీంతో మీ కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్‌ ఛాయిస్‌. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయంపాటు కల్పిస్తుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. ఆరోగ్యకరమైన బరువు నిర్వహణలో ఉంటుంది.

ఇదీ చదవండి:  Dragon Fruit: ఈ పండుతో మీ ముఖంపై ఒక్క మచ్చ, గీత కూడా కనిపించదు..

బ్రౌన్‌ రైస్‌లో కార్బోహైడ్రేట్స్‌ ఉండవు కాబట్టి ఇది హఠాత్తుగా కాకుండా సుస్థిర శక్తిని విడుదల చేస్తుంది. రోజంతటికీ కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా బ్రౌన్‌ రైస్‌లో మెగ్నీషియం, ఫాస్పరస్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎముకకు ఎంతో అవసరం. రెగ్యులర్‌గా బ్రౌన్‌ రైస్‌ తీసుకోవడం వల్ల ఎముక సాంధ్రత  పెరుగుతుంది. ఆస్టీయోపొరోసిస్‌కు దూరంగా ఉండొచ్చు.

ముఖ్యంగా బ్రౌన్‌ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. లిగనన్స్‌, ఫినోలిక్‌ ఉంటుంది. ఇవి సెల్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. ఫ్రీ ర్యాడికల్‌ నివారిస్తాయి. అంతేకాదు ప్రాణాంతక సమస్యలను దూరంగా ఉంచుతాయి. బ్రౌన్‌ రైస్‌ గ్లూటెన్‌ ఫ్రీ కూడా. గోధుమలు తినకూడని వారు ఏ సందేహం లేకుండా బ్రౌన్‌ రైస్‌ తినవచ్చు.

ఇదీ చదవండి:  నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఈ రాశి అత్యంత ప్రత్యేకం..  

బ్రౌన్‌ రైస్‌తో రుచికరమైన రిసిపీలు తయారు చేసుకోవచ్చు. సూప్స్‌తో కలిపి తీసుకోవచ్చు. లేదా సలాడ్‌ కూడా వేసుకుని బ్రౌన్‌ రైస్‌ తినవచ్చు. దీంతో మీ భోజనం రుచితోపాటు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధానంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవారు బ్రౌన్‌ రైస్‌ తీసుకోవాలి. వీటిని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. చక్కెర నియంత్రణలో ఉంటుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News