Banana For Mental Health: అరటిపండు తినని వాళ్లు అంటూ దాదాపుగా ఎవరు ఉండరు.. అరటిపండు ఒక సూపర్‌ఫుడ్. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ , విటమిన్ B6, పొటాషియం & మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరిచి, ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండు శరీరానికి మాత్రమే కాదు, మన మానసిక ఆరోగ్యాన్నీ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండులో మూడ్‌ను మెరుగుపరిచే సెరోటొనిన్ మరియు డోపామిన్ హార్మోన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. హార్మోన్లు తగుపాళ్లలో శరీరంలో ఉండటం వలన మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం పెరుగుతాయి. అరటిపండు తినటం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజాల గురించి ఇక్కడ తెలుపబడింది.
ఒత్తిడి & మానసిక ఆందోళన:
ఈ పోటీ ప్రపంచంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణ సమస్య. పని ఒత్తిడిల వల్ల శరీరంలో సెరోటొనిన్ స్థాయి తగ్గిపోవటం.. తద్వారా మనసు ఆందోళనకు లోనవుతుంది. అరటిపండులోని ట్రిప్టోఫాన్ శరీరంలో సెరోటొనిన్‌ను పెంచి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఉండే మెగ్నీషియం మూలకం నరాల సంకోచాన్ని తగ్గించి, మెదడును శాంత పరచటంలో సహాయపడుతుంది. కాబట్టి, రోజువారీ ఆహారంలో అరటిపండు చేర్చడం ద్వారా మానసిక నుండి విముక్తి పొందవచ్చు.
మంచి నిద్ర:
నిద్రలేమి లేదా ఇన్సొమ్నియా అనేది మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం. అరటిపండులో ఉన్న మెగ్నీషియం & విటమిన్ B6 నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల, నిద్ర సమస్యలు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు అరటిపండు తింటే.. మెదడు ప్రశాంతంగా మారి.. నిద్రలోకి జారుకుంటారు. ఇది ముఖ్యంగా అలసటను తగ్గించేందుకు సహాయపడుతుంది.
డిప్రెషన్ :
చేసే పనిలో, కుటుంబ సమస్యలు ఇతరేతర కారణాల వలన చాలా మంది డిప్రెషన్ కి లోనవుతున్నారు. అరటిపండులోని విటమిన్ B6, ట్రిప్టోఫాన్, డోపామిన్ మరియు సెరోటొనిన్ హార్మోన్లను పెంచడం ద్వారా మూడ్‌ను మెరుగుపరిచి, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే, అరటిపండులో ఉండే గ్లూకోజ్ మెదడుకు తక్షణ శక్తిని అందించి, మూడ్‌ను సెట్ చేస్తుంది కాబట్టి మానసికంగా సమస్య ఉన్నపుడు లేదా డిప్రెషన్ లోకి వెళ్ళినపుడు అరటిపండు తినడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు.
జ్ఞాపక శక్తిలో మెరుగుదల:
అరటిపండులో అధికంగా ఉండే పొటాషియం మెదడు శక్తిని పనితీరును పెంచడానికి తోడ్పడుతుంది. ఇది నాడీ వ్యవస్థను బలపరచి, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్టూడెంట్స్ లేదా ఎక్కువ మానసిక శ్రమతో పని చేసే వారికి అరటిపండు ఒక మంచి దివ్యఔషధంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పరీక్షల సమయంలో అరటిపండు తినడం ద్వారా జ్ఞాపక శక్తి పెరిగి, పరీక్షలు బాగా రాయగలుగుతారు.
మానసిక దృఢత్వం:
రోజు వారి జీవితంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులను ఎదుర్కోవటానికి మానసిక దృఢత్వం చాలా అవసరం. అరటిపండులో ఉన్న గ్లూకోజ్, ఫైబర్ మెదడుకు తక్షణ శక్తిని అందించి.. మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఈ శక్తి మనల్ని నెగెటివ్ థాట్స్ నుంచి దూరంగా ఉంచి, ప్రశాంతంగా ఉంచేలా సహాయపడుతుంది. కాబట్టి ఉత్సాహంగా లేనపుడు, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అరటిపండు తినడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









