Ovarian Cancer Early Signs: కొన్ని కేన్సర్ రకాలు కేవలం మహిళల్లోనే కన్పిస్తాయి. అందులో ప్రమాదకరమైనవి బ్రెస్ట్ కేన్సర్, ఒవేరియన్ కేన్సర్, యుటెరస్ కేన్సర్. ఇందులో ఓ రకం కేన్సర్ ప్రాధమిక లక్షణాలు అస్సలు బయటపడవు. సాధారణంగా ఉండి పసిగట్టలేనివిధంగా ఉంటాయి. అదే ఒవేరియన్ కేన్సర్. ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రారంభదశలో దీనిని గుర్తించడం చాలా కష్టం.
ఒవేరియన్ కేన్సర్ అనేది మహిళల్లో కన్పించే ప్రమాదకరమైన వ్యాధి. ప్రారంభదశలో లక్షణాలు స్పష్టంగా ఉండకపోవడంతో త్వరగా పసిగట్టలేని పరిస్థితి ఉంటుంది. అయితే మీ కోసం ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాం. కొన్ని ప్రారంభ లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే ఈ వ్యాధిని త్వరగా నిర్ధారించవచ్చు. తద్వారా తగిన చికిత్స చేయించవచ్చు. ఒవేరియన్ కేన్సర్ 5 ప్రారంభ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లీడింగ్ అధికంగా ఉండటం
పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా లేక మెనోపాజ్ తరువాత కూడా బ్లీడింగ్ జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉటుంది. ఇది ఒవేరియన్ కేన్సర్ లక్షణం కావచ్చు. అయితే ఇది కేవలం ఒవేరియన్ కేన్సర్ లక్షణం మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల్లో కూడా ఉంటుంది. కానీ ఇలాంటి ఏ లక్షణం కన్పించినా తక్షణం వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకుంటే మంచిది.
కడుపు నొప్పి, స్వెల్లింగ్
ఒవేరియన్ కేన్సర్‌లో ఇదొక ప్రధాన లక్షణం. కడుపు కింది భాగంలో అదే పనిగా నొప్పి లేదా అసౌకర్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా తిన్న తరువాత లేక పీరియడ్స్ సమయంలో ఎక్కువగా ఉండవచ్చు. ఇలా ఉంటే ఒవేరియన్ కేన్సర్ లక్షణంగా అనుమానించాల్సి వస్తుంది. అదే సమయంలో కడుపులో స్వెల్లింగ్ లేదా ఉబ్బినట్టుంటుంది.
తరచూ మూత్రం రావడం
ఏ కారణం లేకుండా రాత్రి వేళ తరచూ మూత్రం వస్తుంటే అది ఒవేరియన్ కేన్సర్ లక్షణం కావచ్చు. ఈ పరిస్థితుల్లో తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
మలబద్ధకం లేదా విరేచనాలు
మలబద్ధకం లేదా విరేచనాలు అకారణంగా ప్రారంభమైతే ఒవేరియన్ కేన్సర్ లక్షణం కావచ్చు. ముఖ్యంగా డైట్ లేదా లైఫ్ స్టైల్ మార్చినా ఫలితం లేనప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఆకలి తగ్గడం
కొంతమందికి ఒక్కోసారి కొద్దిగా తింటే చాలు కడుపు నిండినట్టుంటుంది. ఆకలి కూడా వేయదు. ఇలా జరిగితే నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఇది ఒవేరియన్ కేన్సర్ ప్రాధమిక లక్షణం కావచ్చు.
ఎలా సంరక్షించుకోవాలి
నిర్ణీత పద్ధతిలో మహిళా వైద్యురాలిని సంప్రదిస్తుండాలి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన మహిళలకు ఇది తప్పనిసరి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ఒవేరియన్ కేన్సర్ చరిత్ర ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. హెల్తీ వెయిట్ ఉండేట్టు చూసుకోవాలి. నియమిత పద్ధతిలో వాకింగ్ చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎప్పుడూ పౌష్ఠిక ఆహారం తీసుకోవాలి.
Also read: Best 8 Seater Car: ఎస్‌యూవీ ఎందుకు, అదే ధరకు 8 సీటర్ వచ్చేస్తోంది కదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook