మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా విషయాల్లో అప్రమత్తత అవసరం. ఆహరపు అలవాటే కాకుండా ఇతర అలవాట్లు కూడా అనారోగ్యానికి కారణమౌతుంటాయి. తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శరీరంలో కీలక అంగమైన కాళ్లకు హాని చేకూరుతుంది. ఎక్కువసేపు కూర్చుని ఉండటం వల్ల బరువు పెరగడమే కాకుండా..కాళ్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాళ్లపై దుష్ప్రభావం చూపించనున్న అలవాట్లు


చాలామంది వ్యాయామం చేస్తుంటారు. అయితే ఇందులో ముఖ్యంగా స్ట్రెనింగ్‌కు దూరంగా ఉంటుంటారు. ఇది చాలా నష్టం కల్గిస్తుంది. అందుకే ఎప్పుడు వ్యాయామం చేసినా వారంలో కనీసం 2 సార్లు స్ట్రైనింగ్ తప్పకుండా చేయాలి.


అవసరానికి మించి వ్యాయామం


ఆరోగ్యంగా ఉండాలంటే వర్కవుట్స్ చాలా అవసరమౌతాయి. అయితే వ్యాయామం ఎప్పుడూ పరిమితికి లోబడి ఉండాలి. లేకపోతే కాళ్లకు నష్టం కలుగుతుంది. అవసరానికి మించి వ్యాయామం చేయడం వల్ల విశ్రాంతి లేక కాళ్ల నొప్పులు తీవ్ర సమస్యగా మారుతుంది.


స్మోకింగ్ అలవాటు


స్మోకింగ్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. స్మోకింగ్ ప్రభావం కాళ్లపై కూడా పడుతుంటుంది. సిగరెట్‌లో ఉండే నికోటిన్ రక్త వాహికల్ని కుదించేస్తాయి. దాంతో జాయింట్స్ సహా కాళ్లలో ఆక్సిజన్, ఇతర కీలకమైన పోషకాలు చేరడంలో సమస్య ఉంటుంది.


ఎప్పుడూ కూర్చుని ఉంటే..


ప్రస్తుత ఆధునిక బిజీ పోటీ జీవితంలో చాలామంది ఉద్యోగ నిమిత్తం గంటల తరబడి కూర్చునే ఉంటుంటారు. ఈ అలవాటు కారణంగా బరువు వేగంగా పెరుగుతుంది. కాళ్లకు నష్టం వాటిల్లుతుంది.


Also read: Cholesterol Control Tips: ఈ చిన్న చిన్న ఆహార పదార్థాలతో చెడు కొలెస్ట్రాల్‌ను 8 రోజుల్లో వెన్నలా కరిగించవచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook