Unhealthy food Habits: గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. అది ఆరోగ్యంగా ఉన్నంతసేపే ప్రాణం నిలుస్తుంది. రక్త నాళాలు బలహీనంగా ఉంటే గుండెపోటు ముప్పు ఎక్కవట. ఆ ముప్పు నుంచి కాపాడుకునేందుకు ఈ ఐదు పద్దతలు పాటిస్తే చాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మానవ శరీర నిర్మాణం ఎన్నో రకాల ధమనులు, సిరలతో జరిగింది. శరీలంలో ఉన్న బ్లడ్ వెస్సెల్స్ గుండె నుంచి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని అటూ ఇటూ తీసుకెళ్తుంటాయి. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..శరీరంలోని రక్త నాళికలు లేదా బ్లడ్ వెస్సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి. ఈ నాళికలు మెత్తగా, మృదువుగా ఉంటాయి. ఇందులో రక్తం చాలా సులభంగా ప్రవహిస్తుంది. మీ రక్త నాళికలు బలహీనంగా ఉండకూడదంటే..కొన్ని టిప్స్ పాటించాలి.


రక్త నాళికలు ఆరోగ్యంగా లేకపోతే..ఇందులో పేరుకుపోయే వ్యర్ధాలు అనారోగ్యానికి కారణమౌతాయి. అంతేకాకుండా రక్త సరఫరాలో ఇబ్బందులేర్పడి గుండెపోటు ముప్పు అధికమౌతుంది. రక్తనాళాల్లో సమస్య ఏర్పడితే అది నేరుగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌కు దారితీస్తుంది. అందుకే శరీరాన్ని ఫిజికల్‌గా, యాక్టివ్‌గా ఉంచాలి. ఆరోగ్యకరమైన డైట్ కూడా ఫాలో చేయాలి.


రక్తనాళికలు పటిష్టంగా ఉండాలంటే


తినే ఆహార పదార్ధాల్లో ఎక్కువగా ఫైబర్ ఉండేట్టు చూసుకోవాలి. ఫలితంగా కొలెస్ట్రాల్ సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే రక్త నాళికల్ని డ్యామేజ్ చేసేది కొలెస్ట్రాల్ మాత్రమే. అందుకే తినే భోజనంలో రిఫైండ్ స్థానంలో తృణధాన్యాలు ఎంచుకోవాలి. అటు చిప్స్ స్థానంలో కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలి.


పచ్చని ఆకుకూరల్ని ఎక్కువగా తినడం మంచిది. ఇవి రక్త నాళికలకు చాలా మంచిది. మీరు తినే ఆహారంలో వివిధ రంగుల పండ్లు, కూరగాయలు చేర్చితే..రక్త నాళికలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలి.


రక్త నాళికల ఆరోగ్యం లేదా పటిష్టం చేసేందుకు మసాలా కూడా దోహదపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ధమనుల్ని సంరక్షిస్తాయి. అటు ఎండుమిర్చి కూడా బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. 


మీ ధమనుల్ని ఆరోగ్యంగా ఉంచాలంటే శరీరంలో సోడియం పరిమాణం తగ్గించాలి. అంటే మీరు తినే ఆహారంలో ఉప్పు తగ్గించాలి. సోడియం లెవెల్స్ నియంత్రణలో ఉంటే రక్త నాళికలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికోసం ప్రోసెస్డ్ లేదా ప్యాక్డ్‌ఫుడ్ నుంచి దూరంగా ఉండాలి. 


ఇక చివరిగా నీళ్లు ఎక్కువగా సేవించాలి. శరీరంలో దాదాపు 93 శాతకం నీరే ఉంటుంది. మీ రక్త నాళికలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. 


Also read: Monsoon Fruits: వర్షాకాలం వ్యాధుల్నించి సంరక్షించుకునేందుకు తీసుకోవల్సిన పదార్ధాలివే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook