Vegetables: ప్రోటీన్ ఎక్కువ ఉండే 10 ఆహారాలు.. చికెన్‌ కంటే ఎక్కువే..

High Protein Vegetables: సాధారణంగా మాంసం, గుడ్లు, తృణధాన్యాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే కొన్ని రకాల కూరగాయల్లో కూడా చికెన్ కంటే ఎక్కువగా ప్రోటీన్‌ ఉంటుంది. వెజిటేరియన్ తినేవాళ్లు ఇలా కూరగాయలు తీసుకోవడం వల్ల ప్రోటీన్ అందుతుంది. ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Jun 11, 2025, 09:23 AM IST
Vegetables: ప్రోటీన్ ఎక్కువ ఉండే 10 ఆహారాలు.. చికెన్‌ కంటే ఎక్కువే..

High Protein Vegetables: మన శరీరానికి ప్రతిరోజు కావలసిన ప్రోటీన్ అందాలి. అయితే సాధారణంగా గుడ్లు, మాంసంలో ప్రోటీన్ ఉంటుందనుకుంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు, ఫైబర్ కూడా అందుతాయి. కండరాల ఆరోగ్యానికి కూడా ఇవి సహాయ పడతాయి. ప్రోటీన్‌ ఎక్కువ మోతాదులో కలిగి ఉన్న ఆహారాల జాబితా తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

పాలకూర..
పాలకూరలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు ఇందులో ఐరన్, విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. కడుపునకు మంచి ఆహారం కూడా. సాధారణంగా పాలకూరను తీసుకుంటారు. మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి. 

బ్రోకోలి..
బ్రోకోలిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఉడికించి వేయించి తీసుకుంటారు. లేదా సలాడ్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. బ్రోకోలిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు కూడా పెరగకుండా ఉంటారు. 

పచ్చి బఠాణి..
పచ్చి బఠానీలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఈ కూరగాయల్లో ఎముక ఆరోగ్యానికి సహాయపడే గుణం ఉంటుంది, కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, ఇది ఏదైనా పులావ్ లో వేసుకోవచ్చు, లేదా తయారు చేసుకోవచ్చు . ఇది ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. 

బ్రసెల్ స్ప్రౌట్స్..
బ్రసెల్ స్ప్రౌట్స్ లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా కలిగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. కండరాల ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. 

 కాలే..
 కాలేలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే కూడా ఉంటుంది. కాలే సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. దీని కర్రీ తయారు చేసుకోవచ్చు .ఇది ఆరోగ్యకరమైన స్నాక్ .

 అస్పర్గస్..
 అస్పర్గస్ చాలా తక్కువ మంది తీసుకుంటారు .కానీ ఇందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీన్ని ఉడికించి తీసుకోవచ్చు. రకరకాల ఆహారాల్లో కూడా వేసి తీసుకుంటారు. 

 కాలీఫ్లవర్..
 కాలీఫ్లవర్ లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా క్రూసిఫెరస్‌ జాతికి చెందిన కూరగాయ. దీంతో కర్రీ తయారు చేసుకోవచ్చు. పిజ్జాలు లో కూడా వేసుకుంటారు. దీన్ని వేయించి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. కాలీఫ్లవర్ తో సూప్ కూడా తయారు చేసుకుంటారు.

 మస్టర్డ్ గ్రీన్..
 మాస్టర్ గ్రీన్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. దీని కూర రూపంలో తయారు చేసుకుంటారు. పప్పులో కూడా వేసుకుంటారు. ఇందులో ఇమ్యూనిటీ బూస్టింగ్ గుణాలు కలిగి ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందిస్తుంది. 

 ఎడమామే..
 ఈ ఎడమమే కూడా కూరగాయ. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సోయాబీన్ మాదిరి కనిపిస్తుంది. దీని స్నాక్ రూపంలో తీసుకోవచ్చు సలాడ్లో కూడా వేసుకుంటారు.

Also Read: రాత్రి పడుకునే ముందు జుట్టుకు ఈ నూనె రాస్తే చాలు కుదుళ్ల నుంచి నల్లగా మారిపోతుంది..

Also Read: ఈ విత్తనం తింటే ఎముకలతోపాటు కండరాలు కూడా స్ట్రాంగ్‌ అవుతాయి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News