Hormonal Imbalance In Women: మహిళల్లో హార్మోన్ల  ఇమ్‌బ్యాలెన్స్ చాలా సాధారణ సమస్య. ఇది వివిధ రకాల లక్షణాలకు దారితీస్తుంది. ఈ లక్షణాలు స్త్రీ వయస్సు, ఆరోగ్య పరిస్థితులు వల్ల ఈ హార్మోన్ల  ఇమ్‌బ్యాలెన్స్ కు  కారణమైన హార్మోన్లను బట్టి మారుతూ ఉంటాయి. నేటికాలంలో మారిన ఆహార అలవాట్ల కారణాంగా, తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల ప్రతి పది మంది మహిళలలో ఈ సమస్య ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
ఆరోగ్య నిపుణులు ప్రకారం, మన శరీరంలో యాభై కన్నా ఎక్కువ హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్‌ల లెవల్స్‌ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఈ హార్మోన్‌ ఇమ్‌బ్యాలెన్స్‌ లక్షణాలు కనిపిస్తాయి. అందులో కొన్ని లక్షణాలు.. రుతుస్రావం రాకపోవడం, అధికంగా రుతుస్రావం, తీవ్రమైన నొప్పితో కూడిన రుతుస్రావం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, అంతేకాకుండా ఈ హార్మోన్‌లు  మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. దీని కారణంగా మూడ్ స్వింగ్స్, ఆందోళన, డిప్రెషన్ వంటి లక్షణాలు కలుగుతాయి. ముఖంపై మొటిమలు, పొడి చర్మం లేదా జిడ్డు చర్మం వంటి చర్మ సమస్యలకు హార్మోన్లు కారణమవుతాయి . ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పుల వల్ల వేడి ఆవిర్లు లేదా రాత్రి చెమటలు రావచ్చు. హార్మోన్ల అసమతుల్యత లైంగిక కోరికలను ప్రభావితం చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్మోన్ల అసమతుల్యతకు కొన్ని కారణాలు:


పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS): PCOS అనేది ఒక సాధారణ హార్మోన్ల అసమతుల్యత, ఇది అండాశయాలలో సిస్ట్‌ల ఏర్పాటుకు దారితీస్తుంది.


థైరాయిడ్ సమస్యలు: హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి.


మధుమేహం: మధుమేహం ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలను ప్రభావిత అయినప్పుడు ఈ హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. 



హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ను నివారించడానికి చిట్కాలు:



హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ నుంచి ఉపశమనం పొందాలి అంటే ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్‌ ప్రోటీన్‌ ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ప్రాసెస్‌ చేసిన ఆహారం, షుగర్‌ కలిగే పదార్థాలు, అధిక కొవ్వులు కలిగిన పదార్థాలు తీసుకోకుండా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయండి. ప్రతి రాత్రి 7-8 గంటల నిద్రపోయేలా చూసుకోండి.యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాల వంటి ఒత్తిడిని తగ్గించే పద్ధతులను అభ్యసించండి. మీరు ఏవైనా మందులు తీసుకుంటుంటే అవి మీ హార్మోన్లను ఎలా ప్రభావితం చేస్తాయో మీ వైద్యుడితో మాట్లాడండి. మీకు ఏవైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు ఉంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. మీరు ఈ చిట్కాలను అనుసరిస్తే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి  మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీరు సహాయపడవచ్చు. అలాగే సందేహాలు ఉండే వైద్యుడిని సంప్రదించండి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి