Patanjali farmer support: రైతులకు ఇన్నోవేటివ్ పరిష్కారాలు అందిస్తున్న పతాంజలి.. న్యాయమైన మార్కెట్ విధానాల ద్వారా..!

Patanjali farmer support : పతంజలి రైతుల అభివృద్ధికి సేంద్రీయ సాగు, ఆధునిక సాంకేతికతలు, న్యాయమైన ధరలు వంటి అనేక వినూత్న చర్యలతో మద్దతు ఇస్తోంది. ఈ విధానాలు రైతుల ఆదాయాన్ని పెంచి వారిని ఆత్మనిర్భరంగా మారుస్తున్నాయి.

Written by - Vishnupriya | Last Updated : Apr 16, 2025, 04:27 PM IST
Patanjali farmer support: రైతులకు ఇన్నోవేటివ్ పరిష్కారాలు అందిస్తున్న పతాంజలి.. న్యాయమైన మార్కెట్ విధానాల ద్వారా..!

Patanjali: భారతదేశంలో రైతుల అభివృద్ధి కోసం పతంజలి సంస్థ చాలా కీలకమైన చర్యలు తీసుకుంటోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం పంటలకు న్యాయమైన ధరను అందించడం వంటి పలు కార్యక్రమాల ద్వారా రైతులకు ఆర్థిక, సాంకేతిక పరంగా మద్దతు ఇస్తోంది. పతంజలి, రైతుల ఆదాయాన్ని పెంచడమే కాక, పర్యావరణానికి అనుకూలమైన సాగుపద్ధతులను అవలంబించడానికి వారిని ప్రోత్సహిస్తుంది.

Add Zee News as a Preferred Source

2024 ఏప్రిల్‌లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ రెండు కొత్త అనుబంధ సంస్థలను స్థాపించింది – కంటెంపరరీ అగ్రో ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఋషికృషి ఫార్మింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి సంస్థకి రూ. 20 లక్షల పెట్టుబడి పెట్టి, రైతులకు నూతన వ్యవసాయ సాంకేతికతలను పరిచయం చేయడం, సుస్థిర సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి కార్యక్రమాలను ప్రారంభించింది.

ఈ సంస్థల ద్వారా రైతులు మెరుగైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు పొందడమే కాకుండా, పంట దిగుబడి పెరిగేలా శిక్షణ పొందుతారు. దీనివల్ల వారు మార్కెట్లో మంచి ధరను పొందగలుగుతారు, తద్వారా వారి కుటుంబ ఆదాయం పెరుగుతుంది.

పతంజలి చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలలో రైతు సమృద్ధి ప్రోగ్రాం ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా రైతులకు సేంద్రియ సాగు పై శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ ద్వారా వారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే పద్ధతులు నేర్చుకుంటారు.

పతంజలి నీటి పొదుపు, నేల సంరక్షణకు అనువైన సాంకేతికత అభివృద్ధికి పరిశోధనలపై దృష్టి పెడుతోంది. దీని వల్ల రైతులు దీర్ఘకాలికంగా లాభాలవైపు దిశమారగలుగుతారు.

మొత్తానికి పతంజలి రైతులకు గుడ్‌క్వాలిటీ వనరులు, సాంకేతిక జ్ఞానం.. న్యాయ ధరలతో పంట విక్రయించే అవకాశం కల్పిస్తూ, వ్యవసాయ రంగంలో కొత్త మార్గాలను సృష్టిస్తోంది. ఇది రైతులను ఆత్మనిర్భరత వైపు నడిపించడమే కాక, దేశ వ్యవసాయ రంగాన్ని పటిష్ఠంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇప్పటికే పతంజలి ప్రాజెక్ట్స్ మార్కెట్లో మంచి పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పతంజలి వారు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉండడంతో అందరూ వీరిని అభినందిస్తున్నారు.

Read more: ATM In Train Video: ఇండియన్ రైల్వేస్ మరో సంచలనం.. రన్నింగ్ ట్రైన్‌లో తొలిసారి ఏటీఎం సదుపాయం.. వీడియో ఇదే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News