Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యను ఈజీగా నిర్మూలించే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే

Uric Acid Problem: ఆధునిక జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ అనారోగ్య సమస్యల్లో ముఖ్యమైంది యూరిక్ యాసిడ్ సమస్య. డైట్ నియంత్రించడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2025, 08:16 PM IST
Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్యను ఈజీగా నిర్మూలించే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే

Uric Acid Problem: యూరిక్ యాసిడ్ అనేది ఓ ప్రమాదకరమైన సమస్య. ఈ సమస్యను ఎంత సులభంగా పరిష్కరించవచ్చో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. యూరిస్ సమస్యను ఆహారంలో మార్పులు చేయడం ద్వారా నయం చేయవచ్చు. కొన్ని రకాల పండ్లను డైట్‌లో చేర్చుకుని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Add Zee News as a Preferred Source

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం అనేది అత్యంత ఇబ్బందికర పరిణామం. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, స్వెల్లింగ్, నడవలేకపోవడం, కిడ్నీలో రాళ్లు, ఆకలి లేకపోవడం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఎండాకాలం వచ్చిందంటే ఈ లక్షణాలు మరింతగా పెరుగుతాయి. డీ హైడ్రేషన్ పెరగడం వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. అందుకే సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ, దోసకాయల్ని రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిలో అధికంగా ఉండే ఫైబర్, నీరు కారణంగా శరీరం చలవ చేస్తుంది. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ బయటకు తొలగిపోతుంది. జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయి గణనీయంగా తగ్గుతుంది

ఇక విటమిన్ సి సమృద్ధిగా ఉండే నారింజ పండ్లు తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, స్వెల్లింగ్ తగ్గుతుంది. బొప్పాయిలో కూడా విటమిన్లతో పాటు మినరల్స్, ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే పెపైన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల యూరిక్ యాసిడ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. బొప్పాయి క్రమం తప్పకుండా తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు తగ్గుతుంది. 

చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా అధికం.  వీటిని వారంలో కనీసం రెండు సార్లు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. కీళ్లలో మంటలు తగ్గుతాయి. ఇక సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడిలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా తినకూడదు. 

Also read: SC Corporation Loans: నిరుపేద ఎస్సీలకు గుడ్‌న్యూస్, సబ్సిడీ రుణాలకు ఇలా అప్లై చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News