How To Lose Weight Fast: శరీరంలో అధిక బరువు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది ప్రస్తుతం జిమ్​లు, ఫిట్​నెస్​ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. కృత్రిమంగా కాకుండా, సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుందని మీకు తెలుసా? అయితే 10 రోజుల్లోనే బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసా..?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం లేవగానే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. వ్యాయామంలో చురుకుదనం, వేగం ఉండాలి. ప్రతిరోజు 40 నిమిషాల నుంచి గంటపాటు ఇవి చేయాలి. తెల్లవారిన తర్వాత చేసే వ్యాయామంతో ఎక్కువ ఫలితం ఉంటుంది. ఉదయం పూట అల్పాహారం మానేయొద్దు. అల్పాహారం మానేస్తే.. బరువు పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారం ఎక్కువగా ఒకేసారి తీసుకోవడం కన్నా.. మితంగా రోజుకు ఐదారు సార్లు తీసుకోవడం ఉత్తమం.


  1. నిత్యం బరువు చెక్ చేసుకోవద్దు.

  2. జంక్ ఫుడ్ తినొద్దు. ఆకలిగా ఉన్నప్పుడు ఓ యాపిల్ తింటే మించిది.

  3. ఆకలి మీద దృష్టి వెళ్లకుండా ఉండేందుకు పాటలు పాడడం, సంగీతం వినడం వంటివి చేయాలి.

  4. రోజుకు 8 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి.

  5. కేలరీలు చెక్​ చేసుకుని తినాలి.

  6. సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.

  7. ఆల్కహాల్​ మానేయాలి. కాఫీలు, టీలు వంటివి ఎక్కువగా తాగకూడదు.

  8. ప్రొటీన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర, ఆయిల్, ఫ్యాట్స్ తక్కువగా ఉండేలా చేసుకోవాలి.

  9. తినేప్పుడు గబగబా కాకుండా మెల్లగా తినే అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కడుపు నిండిని భావన కలిగి, తినడం మానేస్తాం.

  10. సాల్మన్ చేపలు, బ్రౌన్ రైస్​ ఆహారంలో భాగం చేసుకోవాలి.


Also Read: Vitamin E and Dry Fruits Benefits: విటమిన్ ఇ లేకపోతే ఆ రెండింటికీ ప్రమాదమే


Also Read: రోజుకు 45 నిమిషాల వ్యాయామంతో శరీరంలో క్యాన్సర్ కు చెక్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook