Dhokla Recipe: డోక్లా అనేది గుజరాతీ స్పెషల్ వంటకం. ఇది భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందినది. డోక్లా ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం. దీని శనగపిండితో తయారు చేస్తారు. ఇది తేలికపాటి, మెత్తటి ఆకృతిని కలిగి ఉంటుంది. స్పాంజీ డోక్లా తయారీకి కావలసిన పదార్థాలు, అలాగే తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం. డోక్లా తినడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు పొందవచ్చు. ఇందులో అతి తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి ఉదయం బ్రేక్‌ఫాట్‌లో తినవచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు:
శెనగపిండి - 1 కప్పు
నూక - 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 1/2 కప్పు
పసుపు - 1/2 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీస్పూన్
పంచదార - 1 టీస్పూన్
నిమ్మరసం - 1 టీస్పూన్
వంట సోడా - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - కొన్ని రెమ్మలు
పచ్చిమిర్చి - 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో శెనగపిండి, నూక, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పంచదార, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
ఇప్పుడు పిండిలో వంట సోడా వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టాండ్ పెట్టి వేడి చేయాలి.
డోక్లా వేసే ప్లేట్‌కు నూనె రాసి పిండిని అందులో వేయాలి. ఈ ప్లేట్‌ను వేడి నీళ్ల గిన్నెలో పెట్టి మూత పెట్టి 15-20 నిమిషాలు ఉడికించాలి. డోక్లా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్పిక్ లేదా చాకును గుచ్చి చూడాలి. టూత్పిక్ లేదా చాకుకు పిండి అంటుకోకుండా వస్తే డోక్లా ఉడికినట్లే. డోక్లా చల్లారాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఈ పోపును డోక్లాపై వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే స్పాంజీ డోక్లా రెడీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









