PBKS vs LSG Highlights: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చి లక్నో సూపర్ జియాంట్స్‌పై భారీ విజయాన్ని సాధించింది. ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ దూకుడైన బ్యాటింగ్‌తో పంజాబ్ 8 వికెట్ల తేడాతో లక్నో నుంచి మ్యాచ్ సొంతం చేసుకుంది. 22 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ గెలిచింది. రిషబ్ పంత్ మరోసారి బ్యాటింగ్‌తో నిరాశపర్చడంతో ఆ జట్టు ఓటమిని చవిచూసింది.
Also Read: MI Beat KKR: డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కత్తాకు భారీ షాక్.. ముంబై సంచలన విజయం
లక్నో ఇచ్చిన 172 పరుగుల సాధారణ లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ చేధించింది. ప్రభు సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. 9 ఫోర్లతో విరుచుకుపడగా.. 3 సిక్సర్లు నమోదు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడి 52* పరుగులు చేసి అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. నేహాల్ వధేరా 43 పరుగులు చేయగా.. ఓపెనర్‌గా దిగిన ప్రియాన్ష్ ఆర్య 8 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్లు చేసిన సాధారణ స్కోర్‌ను లక్నో బౌలర్లు కాపాడలేకపోయారు. వికెట్లు తీయడానికి ప్రయత్నం కూడా చేయనట్టు బౌలర్ల ప్రదర్శన కనిపిస్తోంది. దిగ్వేష్ సింగ్ మాత్రమే రెండు వికెట్లు తీశాడు.
Also Read: IPL 2025 RR vs CSK: ధోని పోరాడినా చెన్నైకి తప్పని రెండో ఓటమి.. రాజస్థాన్ తొలి విజయం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జియాంట్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (0), రిషబ్ పంత్ (2) ఘోరంగా విఫలమవగా.. నికోలస్ పూరన్ 44 పరుగులు చేసిన స్కోర్ అత్యధికం కాగా.. ఆయుశ్ బదౌని 41 పరుగులు చేశాడు. ఐడెన్ మార్‌క్రమ్ (28), అబ్దుల్ సమద్ (27), డేవిడ్ మిల్లర్ (19) కొంత పరుగులు చేశారు. ఐపీఎల్ వేలంలో అత్యధికంగా రూ.27 కోట్లు పలికిన రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతుండడం లక్నోకు ఆందోళన కలిగిస్తోంది. చక్కటి బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్ బౌలర్లు సమష్టి కృషి చేసి లక్నో పరుగులను నియంత్రించారు. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. ఫర్గూసన్, మాక్స్‌వెల్, జాన్‌సెన్, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









