
Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఒత్తిడి, నిద్ర లేమితో పాటు బ్లూ స్క్రీన్ ఎక్కువగా చూడటం. చాలామందికి ఈ మూడు కారణాలే తెలుసు. అయితే విటమిన్ లోపంతో కూడా ఈ సమస్య ఏర్పడుతుందని మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం.
ఆధునిక జీవనశైలి కారణంగా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటం సాధారణమైపోయింది. వీటి వల్ల ముఖం అంద వికారంగా మారుతుంది. డార్క్ సర్కిల్స్ కు చాలా కారణాలున్నాయి. ఆధునిక జీవనశైలిలో సహజంగా ఉండే ఒత్తిడి, నిద్రలేమి, స్క్రీన్ టైమ్ అధికంగా ఉండటం ప్రధాన కారణాలు. వీటివల్ల కంటి కింద నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటినే డార్క్ సర్కిల్స్ అంటారు. ఎంత అందంగా ఉన్నా సరే డార్క్ సర్కిల్స్ ఉంటే మొత్తం అందం పాడవుతుంటుంది. అయితే పైన ఉదహరించిన మూడు కారణాలు కాకుండా పోషకాల లోపం వల్ల కూడా కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయని చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఓ విటమిన్ లోపంతో ఈ సమస్య తలెత్తుతుంది.
కంటి కింద నల్లని వలయాలకు ప్రధాన కారణం విటమిన్ కే లోపం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో విటమిన్ కే లోపిస్తే కంటి చుట్టూ ఉండే స్కిన్ సెల్స్ విరిగిపోతుంటాయి. దాంతో కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. విటమిన్ కేతో పాటు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ లోపం కూడా డార్క్ సర్కిల్స్‌కు కారణం.డార్క్ సర్కిల్స్ దూరం చేసేందుకు మీ డైట్ మార్చుకోవాలి. హెల్తీ ఫుడ్స్ చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు, తాజా పండ్లు, నట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
బ్రోకలీ, టొమాటో, నిమ్మ, కివీ, ఆరెంజ్, ఉసిరి, ద్రాక్ష వంటివాటితో పాటు కూరగాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇక విటమిన్ కే కోసం పాలకూర, బ్రోకలీ, కాలిఫ్లవర్, చేపలు, గుడ్లు, క్యాబేజ్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఇక వెన్న, బొప్పాయి, చిలకడదుంప, ఖుబానీ, క్యారట్, ఆనపకాయ, మామిడిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఇవి డైట్లో ఉండేట్టు చూసుకోవాలి. వేరుశెనగ, బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, పాలకూర, బ్రోకలీ క్రమం తప్పకుండా తీసుకుంటే విటమిన్ ఇ కొరత తీరుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి