)
Lemon Juice Benefits In Telugu: వేసవిలో నిమ్మరసం రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఆస్కార్బిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. ఇద శరీరంలోని రోగనిరోధ శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పాంటోథెనిక్ ఆమ్లం, విటమిన్ బి6తో పాటు ఫోలేట్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంద. అంతేకాకుండా ఈ నిమ్మరంలో కాల్షియం, మెగ్నీషియంతో పాటు ఫాస్పరస్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి వేసవిలో రోజు నిమ్మరం తాగడం చాలా మంచిది. ఈ రసం తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
శరీరం హైడ్రేటెడ్‌గా మారుతుంది:
ఈ నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్లు అనే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇవి పొట్ట సమస్యల నుంచి కిడ్నీల్లో రాళ్ల సమస్యల వరకు అన్నింటి నుంచి ఉపశమనం కలిగిస్తుదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మందిలో వేసవిలో చమట అధికంగా వస్తుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేట్గా మారుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా చేస్తుంది.
విటమిన్ సి :
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండడమే కాకుండా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి, అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి..
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
నిమ్మరసంలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి..ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచి.. ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది..
బరువు నియంత్రణ:
నిమ్మరసంలో కేలరీలు తక్కువగా లభిస్తాయి. ఇది జీవక్రియను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. దీని వల్ల ఎంతో సింపుల్‌గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే తీవ్ర పొట్ట సమస్యల బారిన పడకుండా కూడా ఉంటారు.
చర్మ సమస్యలు:
నిమ్మరసంలోని విటమిన్ సి ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా రక్షిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook