)
Liver Healthy Foods: మనం తీసుకునే ఆహారాలు కాలేయానికి హానికరం చేస్తాయి. తద్వారా అవి ఫెయిల్యూర్ అవ్వడం లేదా ఇతర సమస్యలను తీసుకువస్తుంది. దీనివల్ల ఇతర ఆర్గాన్స్ పై ప్రభావం పడుతుంది. కాలేయ వైఫల్యం వల్ల ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెటబాలిజం రేటు పెరగాలన్న జీర్ణ ఆరోగ్యానికి అయిన ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడాలన్నా కూడా కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. అతిగా ఆల్కహాల్ తీసుకునేవారు. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవారిలో కాలేయం ఫెయిల్యూర్ అవుతుంది. ఇది ప్రధానంగా ఈ కాలేయం డ్యామేజ్, ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలో కాలేయ ఆరోగ్యానికి కొన్ని టిప్స్ పాటించండి
కాలేయ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారాలు..
నిత్యం మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి. ప్రధానంగా ఆకుకూరలైన పాలకూర, బ్రోకోలి వంటి క్రూసిఫెరస్ జాతికి చెందిన ఆహారాలు కాలేయాన్ని డీటాక్స్పై చేస్తాయి. కాలేయంపై ఉండే కొవ్వును కూడా నిర్మూలిస్తాయి.
బెర్రీ జాతికి చెందిన పండ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం కూడా మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటివి తినాలి..
మీ డైట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్నట్స్ బాదాం, సార్డైన్ చేపలు వంటివి కూడా తీసుకోవాలి. ఇది కూడా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది. ప్రధానంగా ఈ గింజల్లో విటమిన్ ఇ ఒమేగా 3 ఎస్ తగ్గించడానికి సహాయపడతాయి.
ప్రతిరోజు రెండు కప్పుల కాఫీ తీసుకోవడం కూడా మంచిది. ఇది కాలేయ క్యాన్సర్ ప్రమాదాలు, లివర్స్ సిర్రోసిస్ నుంచి కాపాడుతుంది. అంటే కాదు ప్రతిరోజు ఏదో విధంగా మీ డైట్ లో పసుపు చేర్చుకోవాలి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. కాలేయాన్ని కాపాడుతుంది.
ఈ ఆహారాలు కాలేయానికి హానికరం..
ప్రధానంగా ఫ్రై చేసిన ఆహారాలు రెడ్ మీట్ లో శాచ్యురేటర్ కొవ్వులు ఎక్కువ శాతంలో ఉంటాయి. ఇది కాలేయంలో కొవ్వు ఎక్కువ శాతం లో పేరుకుపోవడానికి కారణం. దీంతో పాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది రాను రాను లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. కాలేయ ఆరోగ్యానికి మితంగా ఆల్కహాల్ తీసుకోండి.
దీంతోపాటు చక్కెరగా కూడా తక్కువగా తీసుకోవాలి కొన్ని రకాల జ్యూసులు, క్యాండీస్, ఫ్రూట్ జ్యూస్ లో చక్కర వేసుకొని తీసుకుంటారు. ఇది కూడా కాలేయ ప్రమాదానికి దారితీస్తుంది. ప్రధానంగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో కూడా నైట్రేట్, హెపాటాక్స్ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. సోడియం కూడా కలిగి ఉంటుంది ఇది కాలేయాన్ని హానికరం చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook