Maharashtra: హలాల్ సర్టిఫికేషన్ విషయంలో మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జట్కా మటన్ దుకాణాలను కొత్తగా ప్రారంభించిన మల్హార్ సర్టిఫికేట్ కింద నమోదు చేసేందుకు కొత్త కార్యక్రమం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హలాల్ సర్టిఫికేషన్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్రలో కొత్తగా మల్హార్ సర్టిఫికేట్ ప్రారంభమైంది. అంతేకాకుండా రాష్ట్రంలోని జట్కా మటన్ దుకాణాలను మల్హార్ సర్టిఫికేషన్ పరిధిలో తీసుకొచ్చేందుకు కొత్త కార్యక్రమం ప్రకటించారు మంత్రి నితీష్ రాణే. మల్హార్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా హిందూవులే నిర్వహిస్తారని మంత్రి స్పష్టం చేశారు. జట్కా మాంసం సరఫరా చేసేవారికోసం మల్హార్ సర్టిఫికేషన్. కామ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయనున్నారు. ఇలాటి అవుట్‌లెట్స్ 100 శాతం హిందూవులచే నిర్వహించబడతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
హిందూ సమాజం కోసం మహారాష్ట్రలో కీలకమైన అడుగు వేశామని, హిందూ సమాజంలో మార్పు కోసం ఆలోచన చేశామన్నారు మంత్రి నితీష్ రాణే. హిందూవులకు జట్కా మటన్ విక్రయిచే మటన్ దుకాణాలు ప్రవేశం లభిస్తుందన్నారు. హలాల్ సర్టిఫికేషన్ ఉన్న దుకాణాలు ముస్లిం చట్టానికి అనుగుణంగా మాంసం విక్రయిస్తాయని..మల్హార్ సర్టిఫికేషన్ ద్వారా హిందూ సాంప్రదాయం ప్రకారం మాంసం విక్రయాలు ఉంటాయన్నారు. ఈ విధానంలో ఒకే దెబ్బతో నొప్పిలేకుడా జంతువును చంపిన తరువాత తయారు చేస్తారు.
మల్హార్ సర్టిఫికేట్ లేని మాంసం కొనవద్దు
రాష్ట్రంలోని హిందూవులు మల్హార్ సర్టిఫికేట్ లేని మాంసాన్ని కొనుగోలు చేయవద్దని మంత్రి నితీష్ రాణే పిలుపిచ్చారు. సాధ్యమైనంత ఎక్కువగా మల్హార్ సర్టిఫికేట్ ఉపయోగించాలని కోరారు. హిందూవులు మల్హార్ సర్టిఫికేషన్ లేని దుకాణాల్లో మాంసం కొనవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న మల్హార్ వెబ్‌సైట్ జట్కా మటన్, చికెన్ విక్రేతలకు ఓ ధృవీకరించిన వేదిక కానుంది. మేక లేదా గొర్రెను హిందూ మత సాంప్రదాయాల ప్రకారం బలి ఇస్తారని మంత్రి చెప్పారు. జట్కా మాంసాన్ని ప్రత్యేకంగా హిందూ ఖాతిక్ కమ్యూనిటీ విక్రేతల ద్వారా లభిస్తుంది. అందుకే ధృవీకరించిన విక్రేతల నుంచే మటన్ కొనాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నామని వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంది. రానున్న రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే ఆందోళన వ్యక్తమౌతోంది.
Also read: Nomination Tension: మూడు విమానాలు, 14 నిమిషాల గడువు ఉత్కంఠ రేపిన నామినేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









