Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!

Millets Roti Benefits: రోటీ అనేది భారతీయులు ఎక్కువగా తినే ఆహారంలో ఒకటి. ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా రోటీలు తినేందుకు ఇష్టపడతారు. ఇందులో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండడం సహా తక్షణ శక్తిని ఇస్తుంది. రొట్టెలు తయారు చేసే గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న కారణంగా రోజుకు మూడు కంటే ఎక్కువ రోటీలను తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది.

Written by - Harish Darla | Last Updated : Nov 14, 2025, 03:10 PM IST
Millets Roti: చలికాలంలో రోటీ, చపాతి జీర్ణక్రియను నాశనం చేస్తాయి..ఈ పిండితో ఎన్ని రొట్టెలు తిన్నా కడుపే నిండదు!

Millets Roti Benefits: రోటీ అనేది భారతీయులు ఎక్కువగా తినే ఆహారంలో ఒకటి. ఉత్తర భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా రోటీలు తినేందుకు ఇష్టపడతారు. ఇందులో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండడం సహా తక్షణ శక్తిని ఇస్తుంది. రొట్టెలు తయారు చేసే గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న కారణంగా రోజుకు మూడు కంటే ఎక్కువ రోటీలను తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. జీర్ణక్రియ ఆలస్యం అయితే షుగర్ ఎటాక్ అవుతుంది. అయితే చలికాలంలో జీర్ణక్రియ మరింత నెమ్మదిస్తుంది. ఈ క్రమంలో గోధుమపిండికి బదులు ఇతర చిరు ధాన్యాలు లేదా మిల్లెట్స్‌తో చేసిన పిండితో రోటీలు, చపాతిలు తింటే మంచిది. వీటిని ఎక్కువగా తిన్నా మధుమేహం బారిన పడరు. 

Add Zee News as a Preferred Source

శీతాకాలంలో గోధుమలతో తయారు చేసిన రోటీ, చపాతిల కంటే మిల్లెట్స్‌తో చేసిన ఆహారం ఆరోగ్యానికి వరంలా పనిచేస్తుంది.  మనదేశంలో ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో మిల్లెట్స్‌తో చేసిన రోటీలను ఎక్కువగా తినేవారు. ఇప్పుడు మిల్లెట్స్‌కు మరింత డిమాండ్ రావడం వల్ల వాటి లభ్యత తక్కువగా లేదా ధర ఎక్కువగా ఉంటున్నాయి. అయితే శీతాకాలంలో మిల్లెట్స్ రోటీలు తినడం వల్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మిల్లెట్ వినియోగం ఎలా ప్రభావవంతంగా ఉంటుంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మిల్లెట్‌తో చేసిన రీటీల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది చలికాలంలోనూ జీర్ణక్రియ మెరుగ్గా అయ్యేలా చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు కూడా మిల్లెట్స్ సహకరిస్తాయి. మధుమేహ రోగులు మిల్లెట్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవచ్చు. 

మిల్లెట్ పోషకాలు
మిల్లెట్స్‌లో ప్రొటీన్లు అధికంగా ఉండడం సహా విటమిన్-సి, విటమిన్-బీ6, ఫోలిక్ యాసిడ్ వంటివి ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరచడమే కాకుండా శీతాకాలంలో శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. 

మిల్లెట్ ప్రయోజనాలు
ఆధునిక జీవనశైలిలో చాలా మందికి చిన్న వయస్సులో గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. దీంతో మలబద్ధకం, ఉబ్బరం, అధిక చక్కెర, అలసట వంటి సమస్యలకు మిల్లెట్ రోటీ తినడం ప్రయోజనకరంగా మారుతుంది. మిల్లెట్స్‌తో తయారు చేసిన రోటీలు తినడం వల్ల బరువు నియంత్రణకు సహకరిస్తుంది. కనీసం వారంలో ఒకటి లేదా రెండు రోజులు మిల్లెట్స్ పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మిల్లెట్స్‌ పిండిని గోధుమ పిండితో కూడా కలిపి వాడుకోవచ్చు. మిల్లెట్స్‌లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి శరీర కండరాలు, ఎముకలు, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. 

Also Read: Bihar Election Result 2025: అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్..ఇప్పుడు జన్ సురాజ్ పార్టీ..ప్రశాంత్‌ కిషోర్‌ను దెబ్బకొట్టిన జనాలు!

Also REad: Holidays: ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 20 రోజుల సెలవులు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News