Mosambi Winter Benefits: చలికాలంలో ఆరోగ్యకరమైన పండ్లు తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో  మోసంబి పండ్లను ఎక్కువగా చూస్తుంటాము. ఇది ప్రతి సీజన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అద్భుతమైన పండు. ఇందులో బోలెడు విటమిన్‌లు, ఖనిజాలు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండును శీతాకాలంలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోసంబి పండు తినడం వల్ల కలిగే లాభాలు: 


చలికాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విటమిన్ సి కలిగే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. విటమిన్‌ సి మోసంబి పండు అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ముఖ్యంగా శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో చక్కెర లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువగా ఉండటం వల్ల పొట్ట, నడుము చుట్టూ కొవ్వు వెంటనే తగ్గుతాయి. ప్రతిరోజు గ్లాస్ మోసంబి జ్యూస్‌ తాగడం వల్ల ఈ లాభాలు పొందవచ్చు. 


అలాగే మోసంబి మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. మోసంబి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఔషధం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. 


మోసంబి పండు ఆహారంలో ఎలా చేర్చుకోవాలి: 


మోసంబి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దీన్ని రకరకాల రీతుల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు.  మోసంబి జ్యూస్ అత్యంత సులభమైన ఆహారం. దీన్ని ఉదయం లేదా వ్యాయామం తర్వాత తాగవచ్చు.
సలాడ్‌లో మోసంబి ముక్కలను చేర్చి తీసుకోవచ్చు. ఇది సలాడ్‌కు రుచిని పెంచి, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మోసంబి, బాదం, పాలు లేదా పెరుగుతో కలిపి స్మూతీ తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరమైన, పోషక విలువైన పానీయం. కొన్నిసార్లు పచ్చడి, చాట్‌లలో మోసంబి ముక్కలను చేర్చి తీసుకోవచ్చు. ఇది రుచిని పెంచి, ఆహారాన్ని ఆకర్షణీయంగా చేస్తుంది.  వివిధ రకాల పండ్లతో కలిపి మోసంబిని పండ్ల సలాడ్‌గా తయారు చేసుకోవచ్చు. మోసంబి రసాన్ని కొన్ని వంటకాల్లో మసాలాగా ఉపయోగించవచ్చు. ఇది వంటకానికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.  మోసంబి, మంచు, పాలు లేదా పెరుగుతో కలిపి షేక్ తయారు చేసుకోవచ్చు. ఇది వేసవి కాలంలో రుచికరమైన పానీయం.


గమనిక:  మోసంబిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.


Also read: Broadband Plans: 15 ఓటీటీలు, 800 టీవీ ఛానెల్స్, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.