Sunita Williams Return: గత ఏడాది జూన్ నెలలో అంతరిక్షంలో వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు సాంకేతిక కారణాలతో తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. వారం రోజుల్లో రావల్సిన ఆస్ట్రోనాట్స్ 9 నెలల సుదీర్ఘ సమయం తరువాత తిరిగొస్తున్నారు. మరి కొద్ది గంటల్లో అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ల్యాండ్ కానున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమ్మీదకు అడుగుపెట్టనున్నారు. అయితే 9 నెలల సమయం ఏ మాత్రం గ్రావిటీ లేని అంతరిక్షంలో ఉన్నందున కొన్ని కీలకమైన చర్యలు తీసుకుంటుంద నాసా. అంటే భూమ్మీదకు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు వీలుండదు. ఇద్దరు వ్యోమగాములు భూమ్మీదకు క్షేమంగా తిరిగి రాగానే వరుసగా జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి.
భూమ్మీదకు ల్యాండ్ కాగానే జరిగే పరిణామాలు
1. ఫ్లోరిడా జలాల్లో స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ల్యాండ్ కాగానే సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను బయటకు తీసుకొచ్చి స్టెచర్‌పై వైద్య పరీక్షలకు తరలిస్తారు. మైక్రో గ్రావిటీలో ఎక్కువ కాలం ఉన్నందున ఎందుర్కొనే శారీరక సమస్యలు సెట్ చేసే ప్రయత్నం జరుగుతుంది.
2. హోస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న సిబ్బంది క్వార్టర్స్‌కు ఇద్దరు వ్యోమగాముల్ని తరలిస్తారు. అక్కడ కొన్ని రోజుల పాటు వైద్య పరీక్షలు నిరంతరం జరుగుతాయి. నాసా ఫ్లైట్ సర్జన్స్ అనుమతి తరువాతే ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని కలుసుకోగలరు.
3. ఇద్దరు వ్యోమగాములు మిషన్లో తమ అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు , సాధించిన విజయాలను వివిధ కార్యక్రమాల్లో బ్రీఫ్ చేస్తారు.
4. ఆ తరువాత కుటుంబీకులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా తిరిగి సాధారణ జీవితానికి, సంపూర్ణ ఆరోగ్యం పొందేందుకు వీలవుతుంది.
ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు
తల తిరగడం, నాలుక బరువు కోల్పోవడం, బేబీ ఫీట్ వంటి సవాళ్లు ఎదురౌతాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేని చోట దీర్ఘకాలం ఉండటం వల్ల నాసియా, తల తిరగడం, స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలు కన్పిస్తాయి. సరిగ్గా నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, తమ బరువును తాము నియంత్రించుకోలేకపోవడం, అటూ ఇటూ తిరగలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. తిరిగి సాధారణ స్థితికి చేరేందుకు కొన్ని వారాలు పట్టవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









