Neem Leaves: వేప ఆకు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Neem Leaves Benefits: వేప ఆకులు భారతదేశంలో ఎక్కువగా కనిపించే వేప చెట్టు నుండి లభిస్తాయి. వేప చెట్టును "విలేజ్ ఫార్మసీ" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది అనేక రకాల వ్యాధులను నయం చేయగలదు.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Mar 9, 2025, 05:52 PM IST
Neem Leaves: వేప ఆకు వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Neem Leaves Benefits: వేపను "సర్వ రోగ నివారిణి" అని అంటారు, అంటే అన్ని రకాల రోగాలను నయం చేసే దివ్యఔషధమని అర్థం. మన తెలుగు సంప్రదాయంలో వేపకు ప్రత్యేక స్థానంతో పాటు గుర్తింపు కూడా ఉంది. కొంత మంది వేపను దైవంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన వేప ఆకులలో యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంది. ఇవి అనేక వ్యాధులను నయం చేయటమే కాకుండా.. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ని వైద్య గుణాలను కలిగిన వేప వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. రోజు వేప ఆకులను తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇపుడు తెలుసుకుందాం.. 

Add Zee News as a Preferred Source

1. చర్మ ఆరోగ్యం (Skin Health)

వేప ఆకులు మొటిమలు, అలర్జీలు, పొడిబారిన చర్మం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి.  వేప ఆకులతో చేసిన కషాయంతో ముఖం కడిగితే ఫేస్ మిలమిల మెరుస్తుంది 
చర్మంపై మంటలు, ఎర్రబడటం, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలకు వేపాకు ఔషధంగా పని చేస్తుంది. 

2. రక్తం శుద్ధి.. 

వేప ఆకులను తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. ఇది చర్మ సమస్యలతో పాటు రక్తంలో ఉన్న టాక్సిన్ లను శరీరం నుండి బయటకి పంపించేస్తుంది 

3. నియంత్రణలో డయాబెటిస్ 

వేప ఆకుల గుణాలు రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడతాయి. వేప ఆకులతో చేసిన కషాయం తాగడం వలన టైప్-2 డయాబెటిస్ తో బాధపడేవారికి మేలును కలిగిస్తుంది.

4. జీర్ణవ్యవస్థలో మెరుగుదల

వేప ఆకులలో యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి, ఇవి కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించడంలో సహాయపడతాయి.  కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కొనే వారు వేపాకుల కషాయాన్ని తాగితే మంచి ఫలితాలను పొందుతారు

5. పళ్లు మరియు చిగుళ్ల ఆరోగ్యం

వేప ఆకులే కాకుండా వేప పుల్లలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. వేప పుల్లల్తో పళ్లు తోమితే పళ్లు బలంగా మారతాయి. అంతేకాకుండా వేప పుల్లలు కావిటీస్ తో పాటు, దంతాల కింద పేరుకుపోయే మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.

6. రోగనిరోధక వ్యవస్థలో మెరుగుదల

వేప ఆకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోగ నిరోధక శక్తి వ్యవస్థను పటిష్టంగా మార్చటమే కాకుండా.. జలుబు, వైరల్ ఫీవర్స్, అంటువ్యాధులకు దూరంగా 
ఉంచుతుంది. 

7. జుట్టు ఆరోగ్యం మెరుగుదల 

చుండ్రుతో ఇబ్బంది పడే వారికి వేపాకులతో చేసిన కషాయం మంచి ఔషధంగా చెప్పవచ్చు. ఈ కషాయంతో తల తల స్నానం చేయటం వలన చుండ్రు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.  వీటితో పాటుగా తలకు రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.

8. యాంటీబయాటిక్ & యాంటీ ఫంగల్ గుణాలు 

వేప ఆకులు వివిధ బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం కాలినపుడు లేదా గాయం తగిలిన ప్రాంతాలలో వేప ఆకుల గుజ్జు రాస్తే గాయం త్వరగా మానిపోతుంది.

 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News