Unpolished Rice Benefits: మనలో చాలా మందికి బియ్యం అనగానే గుర్తుకు వచ్చేది.. తెల్లగా, నిగ నిగ లాడే రైస్.. ఈ జనరేషన్ లో చాలా మందికి పాలిష్ చేయని బియ్యం గురించి తెలీదు. ఇలా ఎలాంటి పాలిష్ చేయకుండా, గోధుమ రంగులో ఉండే బియ్యాన్నే దంపుడు బియ్యం అంటారు. ఈ దంపుడు బియ్యం వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి బియ్యంలో ఉండే పోషకాలన్నీ పాలిష్ చేయటం ద్వారా తొలగిపోతాయి. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలు అందించబడవు.
పాలిష్ చేయకుండా గోధుమ రంగులో ఉండే బియ్యం తినటం వలన ఎన్ని లాభాలో తెలిస్తే.. ఈ రోజు నుండే పాలిష్ చేసిన బియ్యాన్ని కాకుండా దంపుడు బియ్యాన్ని రోజు ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ప్రాక్టిన్, బీటా గ్లుకాన్స్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దంపుడు బియ్యం వలన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇపుడు మనం తెలుసుకుందాం..
జీర్ణక్రియకు సహాయపడుతుంది:
దంపుడు బియ్యంలో అధిక ఫైబర్ మూలకం ఉండటం వలన ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, నిరంతరంగా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గడం:
పైన తెలిపిన విధంగా దంపుడు బియ్యంలో అధిక ఫైబర్ వలన శరీరానికి అధిక క్యాలోరీలు అందించబడవు. దీంతో పాటు ఎక్కువ సమయం ఆకలి అవ్వకపోవటం వలన అధిక మొత్తంలో క్యాలోరీలు తీసుకునే ప్రక్రియ తగ్గుతుంది. ఫలితంగా మీ బరువు తగ్గుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా ప్రతి రోజు వైట్ రైస్ కి బదులుకోగా దంపుడు బియ్యాన్ని తీసుకోవటం చాలా మంచిది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
దంపుడు బియ్యంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెను రక్షించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
శక్తిని అందిస్తుంది:
దంపుడు బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎక్కువ శ్రమ లేదా భౌతికంగా ఎక్కువ పని చేసే వారికి ఇదొక మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాయామాలు చేసే వారికి ఉత్తమమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. గా ఉపయోగపడుతుంది.
నియంత్రణలో బీపీ:
దంపుడు బియ్యంలో పొటాషియం సమృద్ధిగా ఉండటంతో, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల హైపర్‌టెన్షన్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
దంపుడు బియ్యంలో విటమిన్ B సమృద్ధిగా ఉండటంతో, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ బియ్యం శరీర పనితీరును మెరుగుపరచడమే కాకుండా, వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









