Hemoglobin Foods: హిమోగ్లోబిన్ అనేది మన శరీరంలోని ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్‌కి ఎర్ర రంగు ఉండటం వల్లనే మన రక్తం ఎర్రగా కనిపిస్తుంది. హిమోగ్లోబిన్ ప్రధాన పని శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడం. ఊపిరితిత్తుల నుంచి తీసుకున్న ఆక్సిజన్‌ను హిమోగ్లోబిన్ తనలో బంధించుకొని, శరీరంలోని ప్రతి కణానికి చేరవేస్తుంది. అయితే కొన్నిసార్లు చాలా మంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెబుతుంటారు. ఇంకీ హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది..? ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
హిమోగ్లోబిన్ తగ్గడం అంటే ఏమిటి?
హిమోగ్లోబిన్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు దీనినే రక్తహీనత అంటారు. రక్తహీనత వల్ల శరీరంలోని కణాలకు సరిపడా ఆక్సిజన్ అందదు. దీంతో అలసట, బలహీనత, తల తిరుగుట వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం తగ్గడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి శరీరంలో ఐరన్ తక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ తయారీ తగ్గుతుంది. విటమిన్ బి12 కూడా హిమోగ్లోబిన్ తయారీకి అవసరం. ఫోలిక్ యాసిడ్ లేకపోతే కూడా రక్తహీనత వస్తుంది. అతిగా రక్తం కారడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. ఎముక మజ్జ సరిగ్గా పని చేయకపోతే కూడా రక్తహీనత వస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కొన్ని సహజమైన మార్గాలు ఉన్నాయి.
ఆహారం ద్వారా హిమోగ్లోబిన్ పెంచడం
పాలకూర, బీట్‌రూట్, దానియాలు, ఆపిల్, గుడ్డు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. చిక్కుళ్ళు, గింజలు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు వంటివి కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.
విటమిన్ సి రిచ్ ఆహారాలు:
నారింజ, నిమ్మ, కివి, బెర్రీలు వంటి పండ్లు విటమిన్ సిని అధికంగా కలిగి ఉంటాయి. విటమిన్ సి శరీరం ఐరన్‌ను సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది.
ఫోలిక్ యాసిడ్ , విటమిన్ బి12:
పాలకూర, బ్రోకలీ, బఠానీలు, గ్రీన్ బీన్స్ వంటి ఆకుకూరలు ఫోలిక్ యాసిడ్‌కు అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మాంసం, చేప, గుడ్డు, పాలు వంటివి విటమిన్ బి12 కి మంచి మూలాలు.
జీవనశైలి మార్పులు
తగినంత శారీరక శ్రమ హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నిద్ర లేమి హిమోగ్లోబిన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం హిమోగ్లోబిన్ స్థాయిలను తగ్గిస్తాయి.
వైద్య సలహా
హిమోగ్లోబిన్ స్థాయిలను తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ సూచించిన మందులు, సప్లిమెంట్లు తీసుకోవడం.
గమనిక: హిమోగ్లోబిన్ తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కాబట్టి, సమస్యను నిర్ధారించి చికిత్స చేయడానికి డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe Twitter, Facebook
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









