Okra Water: ఈ నీరు మహిళలకు తిరుగులేని రామబాణం.. దీర్ఘాయుష్షు, మచ్చలేని చర్మం..

Okra Water Cinnamon For Women: బెండకాయ కూర లేదా పులుసు పెట్టుకొని తింటారు. ఇది రుచికరంగా ఉండటమే కాదు.. ఆరోగ్యకరం కూడా అయితే బెండకాయ నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. అంతేకాదు దీంతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 8, 2025, 09:40 AM IST
Okra Water: ఈ నీరు మహిళలకు తిరుగులేని రామబాణం.. దీర్ఘాయుష్షు, మచ్చలేని చర్మం..

Okra Water Cinnamon For Women: బెండకాయ నీరు మహిళలు తీసుకోవడం వల్ల మ్యాజికల్ బెనిఫిట్స్ పొందుతారు. వారి ఆరోగ్యం బలంగా ఉంటారు. బెండకాయ నీటిని దాల్చిన చెక్క లవంగాలతో కలిపి తీసుకోవడం వల్ల నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? గుండె ఆరోగ్యానికి ప్రతి ఒక్క మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి. బెండకాయ నీరు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపి ఆ నీటిని తీసుకోవడం వల్ల మహిళలకు చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి. రక్త సరఫరా మెరుగ్గా మారుతుంది. ఎందుకంటే బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మంట సమస్యలను తగ్గిస్తాయి. ఇక లవంగం, దాల్చిన చెక్క, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్త సరఫరాను మెరుగు చేస్తాయి. ఈ మూడిటిని కలిపి తీసుకోవడం వల్ల సమతుల ఆహారం అవుతుంది. కార్డియో ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి.

Add Zee News as a Preferred Source

అంతేకాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న మహిళలు బెండకాయ నీటిని ఉదయం తీసుకోవటం వల్ల క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ కంట్రోల్ చేయటమే కాకుండా అతిగా ఆకలి లేకుండా చేస్తుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు. హఠాత్తుగా రక్తంలో షుగర్ స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. మెటబాలిజం రేటును పెంచుతుంది.

తరచుగా ఈ బెండకాయ నీటిని మూడిటి కాంబినేషన్లో తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. లవంగం, దాల్చిన చెక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు కలిగి ఉంటాయి. ఇది చర్మం డ్యామేజ్‌ కాకుండా కాపాడుతాయి. మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. 

ఇదీ చదవండి:  Video: నువ్వు కూడా సీఎం రేవంత్‌ పేరు మర్చిపోయావా తల్లి? ఇండియా టుడే యాంకరమ్మ ఏ పేరుతో పిలిచిందో చూడండి.. 
రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉండాలంటే బెండకాయ నీరు ఉదయం పరగడుపున తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. బెండకాయలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.. హఠాత్తుగా పెరగకుండా చేస్తుంది. అంతేకాదు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.

బెండకాయ నీరు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాల్చిన చెక్క, లవంగం కలిపి బెండకాయ నీరు తీసుకుంటే ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. అంతేకాదు మలబద్ధక సమస్య దరి చేరనివ్వదు. దాల్చిన చెక్క యాంటీ మైక్రోబియాల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తి రాకుండా కాపాడుతుంది.

ఇదీ చదవండి: రంగుల హోలీ ఆడుతున్నారా? ఇది లేకుంటే నష్టపోతారు జాగ్రత్త..

రెగ్యులర్‌గా బెండకాయ నీరు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపరుస్తుంది. సీజనల్‌ జబ్బులు రాకుండా కాపాడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మన శరీరానికి హాని కలగకుండా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. బెండకాయలు కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి అందులో దాల్చిన చెక్క, లవంగం పొడిని వేసుకొని ఉదయం పరగడుపున తీసుకోవాలి .

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News