)
Omelette Vs Boiled Egg For Weight Loss: వెయిట్ తగ్గాలని చాలామంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో కొవ్వు తక్కువగా ఉండి క్యాలరీలు కూడా తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. అదే సమయంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండాలి. ఇది ఫైబర్ కూడా కలిగి ఉంటే మరీ మంచిది. అయితే ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మనకు శక్తి అందటమే కాకుండా కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. చాలామంది బరువు తగ్గాలనుకున్నప్పుడు గుడ్డు తీసుకునే విధానం తప్పుగా ఉంటుంది. అది ఉడికించిన తీసుకోవాలా? ఆమ్లెట్ తీసుకోవాలా? ఆలోచించాలి . ఉడికించిన గుడ్డు ఇది ఇందులో నూనె ఉండదు. బట్టర్ కూడా వేసుకోము. ఇందులో ఏ ఇతర కొవ్వు పదార్థాలు వాడకుండా నేరుగా తినేస్తాం. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఉడికించిన గుడ్డు తీసుకోవడం వల్ల క్యాలరీలు తక్కువ అంగుతాయి. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు
అంతే కాదు ఈజీగా మనం లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసుకొని కూడా ఆఫీస్ కి తీసుకోవచ్చు. స్నాక్స్ సమయంలో సలాడ్ తో పాటు కూడా తీసుకోవచ్చు. అనవసరమైన కొవ్వులు కూడా మన డైట్ లో చేరదు. అంతేకాదు దీంతో మన కండరాల అభివృద్ధి చెంది బరువు కూడా తగ్గుతారు.
ప్రతిసారి ఉడికించిన గుడ్డు తిని బోర్ కొట్టినప్పుడు ఆమ్లెట్ కూడా వేసుకొని తింటాం. ఇందులో పాలకూర, టమాటా, ఉల్లిపాయ జల్లుకొని కూడా తీసుకుంటాం. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులో నూనె వాడాల్సి వస్తుంది. కాబట్టి క్యాలరీలు చేరుతాయి. అయితే ఇలా ఆమ్లెట్ వేసుకున్నప్పుడు కేవలం ఆలివ్ ఆయిల్ లేదా ఆవ నూనె వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో కొవ్వులు తక్కువగా ఉంటాయి. బరువు పెరగకుండా ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈజీగా ఆమ్లెట్ ని వేసుకొని తినవచ్చు. వర్కౌట్ చేసిన తర్వాత కూడా తీసుకోవడం వల్ల తక్షణ శక్తి కూడా అందుతుంది. కడుపునిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది.
అయితే ప్రతిరోజు ఎన్ని గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది తెలుసా? ప్రతిరోజు రెండు గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమని చెబుతున్నారు. అయితే మీరు గుడ్లు తీసుకునేటప్పుడు దీంతో పాటు కొన్నిరకాల కూరగాయలు, తృణ ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చి తీసుకుంటే మంచిది. క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందులో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండి ఎనర్జీ బూస్ట్ కూడా వస్తుంది. తద్వారా మెటబాలిక్ రేటు పెరిగి కార్డియో ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
కొంతమంది గుడ్డు పచ్చ భాగం తీసేసి కేవలం తెల్ల భాగం మాత్రమే తింటారు. పచ్చ భాగం కూడా ఆరోగ్యకరం. ఇందులో విటమిన్ ఏ, డీ, ఈ, కే, బీ12, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది. అంతేకాదు ఇది మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇందులో లూటీన్, జియాంథీన్ ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే పొరపాటున పచ్చ భాగాన్ని తీసేసి తినకండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook