Papaya And Lemon: బొప్పాయి నిమ్మరసం ప్రతిరోజు తీసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పు ఇదే..

Papaya And Lemon Juice Benefits: బొప్పాయి పండు, లెమన్ కలిపి తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు మెండు. ఇది రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. పోషకాలకు పవర్ హౌస్ బొప్పాయి ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌, మినరల్స్ ఉంటాయి. బొప్పాయి, నిమ్మకాయ రెండు కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 15, 2025, 02:50 PM IST
Papaya And Lemon: బొప్పాయి నిమ్మరసం ప్రతిరోజు తీసుకుంటే మీ శరీరంలో జరిగే మార్పు ఇదే..

Papaya And Lemon Juice Benefits: బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. బొప్పాయి, నిమ్మరసం రెండు కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Add Zee News as a Preferred Source

బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల పోషకాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా నిమ్మకాయలు విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. బొప్పాయిలో కూడా విటమిన్ సి ఉంటుంది. అంతేకాదు బొప్పాయిలో విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.. బొప్పాయి, నిమ్మరసం రెండు కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. సీజనల్ వ్యాధులతో పోరాడడానికి తగిన శక్తి కూడా అందిస్తుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తికి కూడా తోడ్పడుతాయి.

జీర్ణ ఆరోగ్యం మెరుగు..
బొప్పాయిలో పప్పెయిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది  ప్రోటీన్స్ విడగొడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి సులభతరం చేస్తుంది. నిమ్మకాయను బొప్పాయితో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. తరచూ రెండు కలిపిన జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్, మలబద్దకం సమస్యకు మంచి రెమిడీ. బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది, జీర్ణ సమస్యలకు చక్కని రెమిడీ.

బరువు తగ్గాలనుకునేవారు బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది మంచి డ్రింక్ అవుతుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. కాబట్టి అతిగా ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు పెరగకుండా ఉండాలి అంటే ఈ రెండు కలిపిన జ్యూస్ తీసుకోవాలి. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది కొవ్వులను కరిగించేస్తుంది.

ఇదీ చదవండి: ఈ ఎర్ర పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా బోలెడు ప్రయోజనాలు

బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకోవటం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మేలు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా స్కిన్ ని కాపాడుతాయి.. దీంతో ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. చర్మానికి సాగే గుణం లభిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా రాకుండా ఉంటాయి. బొప్పాయి, నిమ్మరసం కలిపిన జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ ముఖంపై ఉన్న మచ్చలు, గీతాలు కూడా తొలగిపోతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే యాక్నేను సైతం తగ్గించేస్తుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది..

బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఇది మంచి డిటెక్సిఫయర్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో డైరుటిక్‌ గుణాలు మన శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది. దీంతో మంచి డిటాక్స్పై డ్రింక్‌గా పనిచేస్తుంది. కాలేయ పనితీరు మెరుగవుతుంది. మన శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగించి కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు బొప్పాయి, నిమ్మరసం కలిపిన జ్యూస్ తీసుకోవడం వల్ల మన రక్తం కూడా శుద్ధి అవుతుంది.

ఇదీ చదవండి: బామ్మ చెప్పిన సీక్రెట్‌.. ఇలా చేస్తే జుట్టు వేగంగా, ఒత్తుగా పెరుగుతుంది..!

బొప్పాయి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు. ఎందుకంటే ఇందులో ఫైబర్, పొటాషియం ఉంటుంది..  బొప్పాయిలో ఉండే విటమిన్ సి గుండె సమస్యలకు నివారిస్తుంది. ఆక్సిడేషన్ రాకుండా నివారించి మన శరీరానికి మేలు చేస్తుంది. ఈ జ్యూస్‌ తరచూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గిపోయి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News