Patanjali: బిజినెస్ కన్నా సేవా కార్యక్రమాలు మిన్నా అంటున్న పతాంజలి..!

Patanjali social service: వ్యాపార లాభాలకు మాత్రమే పరిమితం కాకుండా, పతంజలి సంస్థ ఆరోగ్యం, విద్య, సహాయ చర్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో సమాజ హితానికి సేవలందిస్తోంది. ఇది వ్యాపారానికి మించి మానవతా దృక్పథంతో చేసిన కృషి.

Written by - Vishnupriya | Last Updated : Apr 9, 2025, 01:00 PM IST
Patanjali: బిజినెస్ కన్నా సేవా కార్యక్రమాలు  మిన్నా అంటున్న పతాంజలి..!

Patanjali Services: వ్యాపార ఉద్దేశ్యాలకే పరిమితం కాకుండా, పతంజలి సమాజ హితానికి అనేక రంగాల్లో విస్తృతంగా సేవలందిస్తోంది. ఆరోగ్యం, విద్య, ప్రకృతి పరిరక్షణ, సహాయ కార్యక్రమాల్లో వారి కృషి ఎంతగానో ప్రసంశనీయం. ప్రస్తుతం ఎన్నో పనులు చేపడుతున్నారు వీరు. అంతే కాదు ఈ సంస్థ చేస్తున్న పనులు చూసి అందరూ తమ ప్రశంసలు తెలియజేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌ను బాబా రాందేవ్.. ఆచార్య బాలకృష్ణ స్థాపించారు. ఆయుర్వేద ఉత్పత్తుల కోసం ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ, కేవలం వ్యాపార లాభాలకే పరిమితం కాకుండా సమాజ అభివృద్ధికి పెద్ద పట్టు వేస్తోంది.  

పతంజలి యోగ్ పీఠ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉచిత యోగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ, ఖరీదైన చికిత్సల భారాన్ని మోసుకోలేని ప్రజలకు ఇది గొప్ప సేవగా మారుతోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ముందడుగుగా నిలవబోతోంది.  

డిజాస్టర్ రిలీఫ్ సేవలు:  

వర్షాలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో పతంజలి సహాయ చర్యల్లో ముందు వరుసలో నిలుస్తుంది. 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలో వారు భారీగా సహాయం అందించారు. ఇది మానవతా దృక్పథంతో చేసిన సేవ.  

విద్యా సేవలు:  

పతంజలి యూనివర్సిటీ ద్వారా యోగా, ఆయుర్వేదం, నేచరోపథీ లాంటి కోర్సులు అందిస్తున్నారు. ఈ శిక్షణలు యువతకు ఆరోగ్య రంగంలో కెరీర్ అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమోషన్‌తో వారు భవిష్యత్తును మలుపు తిప్పుతున్నారు.  

పర్యావరణ పరిరక్షణ:  

పతంజలి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులకు శిక్షణ, విత్తనాలు అందిస్తూ, ప్రకృతిని కాపాడేందుకు ముందుండి పనిచేస్తోంది. వర్షపు నీరు భద్రపరచడం, నీటి శుద్ధి వంటి పర్యావరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.  

ఇలా పతంజలి యొక్క సేవలు వ్యాపారాన్ని మించి సమాజానికి నిలకడైన మేలు చేస్తోంది.  దీని ద్వారా ఎంతోమందికి మేలు జరగనుంది. పతంజలి వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారు. మరి భవిష్యత్తులో పతంజలి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి.. మరె ఎంతో మందికి లాభం చేకూరేస్తారేమో వేచి చూడాలి.

Also read: New Ration Card: కొత్త రేషన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి, ఏమేం డాక్యుమెంట్లు కావాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News