Pineapple Diet: పైనాపిల్‌ డైట్‌లో చేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Pineapple Diet: ప్రతి రోజు పైనాపిల్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 8, 2025, 06:11 PM IST
Pineapple Diet: పైనాపిల్‌ డైట్‌లో చేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Pineapple Diet Telugu: పైనాపిల్‌ రోజు తినడం మంచిదేనా? చాలా మంచి పైనాపిల్‌ రోజు తింటూ ఉంటారు. అయితే దీనిని రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, బ్రోమెలైన్, విటమిన్ బి6, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి పైనాపిల్‌ ప్రతి రోజు తింటే రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి. రోజు దీనిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

రోగనిరోధక శక్తి: 
పైనాపిల్‌ రోజు తింటే శరీరానికి తగిన మోతాదులో విటమిన్ సి అందుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగపరచడమే కాకుండా సీజనల్‌ వ్యాధులతో పాటు అంటు వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ప్రాణాపాయ ప్రమాదం కూడా తగ్గుతుంది.

జీర్ణక్రియ సమస్యలు: 
పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జీర్ణక్రియ సమస సహాయపడుతుంది, తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

మంటల సమస్యలు: 
ఈ పండులో బ్రోమెలైన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇది శరీరంలోని మంటలను తగ్గించి.. వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

ఎముకల సమస్యలు: 
పైనాపిల్‌లో మాంగనీస్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి దీనిని ఉదయాన్నే తినడం వల్ల ఎముకల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇది ఎముకలను దృఢంగా, శక్తివంతంగా తయారు చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇవే కాకుండా బోలు ఎముకల సమస్యలు కూడా తగ్గుతాయి. 

శృంగార సామర్థ్యం: 
పైనాపిల్‌లో ఉండే మాంగనీస్ టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల  లైంగిక వాంఛనలతో పాటు సామర్థ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు కోసం ప్లాన్‌ చేస్తున్నవారు తప్పకుండా డైట్‌లో ఉండెట్లు చూసుకోండి. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News