Pomegranate Leaves Benefits: దానిమ్మ పండు ఇది మార్కెట్లో విరివిగా అతి తక్కువ ధరలోనే విక్రయిస్తారు. ఇందులో ఔషధ గుణాలు తక్కువగా ఉంటాయేమో అని భ్రమపడతారు. కానీ, ఇందులో పోషకాలు పుష్కలం.. దానిమ్మ ఆకుల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ పండు మాత్రమే కాదు ఆకుల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే ఉంటాయి. దానిమ్మ ఆకులతో కామెర్ల వ్యాధి, డయేరియా, కడుపునొప్పి సమస్యకు చెక్ పెట్టొచ్చు. అంతే కాదు బరువు తగ్గాలనుకునే వారికి ఇది వరం. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. దానిమ్మ ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇది ఎన్నో జబ్బులను నయం చేసే గుణం ఉంటుంది. రెగ్యులర్ డైట్‌లో దానిమ్మ ఆకులను తీసుకోవాలి
దానిమ్మ ఆకులతో ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ఇది దగ్గు, జలుబుకి మంచి రెమిడీ. వీటిని నీటిలో మరిగించి తీసుకోవటం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు కనిపిస్తాయి .10 రోజుల్లో మీకు ఏ వ్యాధి లేకుండా పరారవుతుంది. అంతేకాదు దానిమ్మ ఆకులు నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఈ ఆకులను ఉదయం పరగడుపున మరిగించి తీసుకోవాలి.. లేకపోతే ఈ నీటిని పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చక్కని పరిష్కారం.
అంతేకాదు దానిమ్మ ఆకులను తీసుకోవడం వల్ల ప్రాణాంతక జబ్బుల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ ఆకులు ఎగ్జిమా సమస్య నుంచి కాపాడుతుంది. ఇది చర్మం దురద సమస్యను నివారిస్తుంది. దానిమ్మ ఆకులను దంచి పేస్టు మాదిరి చేసుకొని దురద ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలు కనిపిస్తాయి.
ఇదీ చదవండి: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. మార్చి 13, 14, 15, 16 వరుసగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఎందుకు తెలుసా?
దానిమ్మ ఆకుల ఆరోగ్య పరంగా మాత్రమే కాదు.. చర్మ సౌందర్య ప్రకారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు వాటి తాలూకు ఆనవాళ్లు ఉంటే దానిమ్మ ఆకులను దంచి పేస్టును ముఖానికి అప్లై చేయాలి. ఇది కంటి భాగంలో అప్లై చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి వెంటనే మచ్చలు తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
దానిమ్మ ఆకులు మరిగించి ఆ నీటిని తీసుకోవటం వల్ల కడుపునొప్పి సమస్య తక్షణమే తగ్గిపోతుంది .ఇందులో తక్షణ శక్తి అందించే గుణాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా డయేరియా నుంచి కూడా బయటపడతారు. దానిమ్మ ఆకులతో చేసిన నీళ్లు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.. అంతేకాదు ఇందులో ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉండటం వల్ల ఇది సన్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇది ఇమ్యూనిటీ కి సంబంధించిన డిజార్డర్స్ నుంచి మనల్ని బయట పడేస్తుంది. దానిమ్మ ఆకులను కామెర్లు, డయేరియా వ్యాధులను మన బామ్మల కాలం నుంచి డయేరియా నయం చేయడంలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పిల్లలకు కూడా ఈ ఆకులను వినియోగిస్తారు.
ఇదీ చదవండి: సామాన్యులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు, ఎంత పెరిగాయి తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









