Intermittent Fasting: రాత్రి ఎక్కువగా తిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మిస్సవ్వడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు

Intermittent Fasting Uses: రాత్రిపూట ఎక్కువగా తిని, ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం అనేది చాలా మందిలో కనిపించే ఒక అలవాటు. దీని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Mar 9, 2025, 05:19 PM IST
Intermittent Fasting: రాత్రి ఎక్కువగా తిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మిస్సవ్వడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు

Intermittent Fasting Uses: ఎవరికైనా సరే రాత్రి ఎక్కువ ఐటమ్స్ డైనింగ్ టేబుల్ పై కనపడగానే ఆకలి ఎక్కువ అయిపోతుంది.. ఫలితంగా పరిమితిని మించి ఆహారం తీసుకుంటారు.. అయితే కొంత మంది రాత్రి ఎక్కువగా తిన్నందున ఉదయం బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటారు. దీనినే ఇంటర్మిటెండ్ ఫాస్టింగ్  Intermittent fasting అంటారు. ఇది ఫాలో అవ్వటం మంచిదే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. కానీ ఇది అందరికి కాదండోయ్.. కొంత మందికి ఇది హానికరం కూడా.. ఆ వివరాలు.. 

Add Zee News as a Preferred Source

1. రాత్రి ఎక్కువగా  బ్రేక్ఫాస్ట్ మానేయటం వలన కలిగే లాభాలు

శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది 
కొంతమంది కోసం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది 

2. ఇన్సులిన్ సెన్సిటివిటీ.. 

కొంతమందిలో రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమై, ఉదయాన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది కావున ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 

3. ఆటోఫేజీ (Autophagy) మెరుగుదల

పాత లేదా దెబ్బ తిన్న కణాలను తొలగించే ప్రక్రియనే ఆటోఫేజీ అంటారు. దీర్ఘకాల ఉపవాసం శరీరంలో ఆటోఫేజీ మరింత ప్రేరేపిస్తుంది. ఫలితంగా శరీరంలో ఆరోగ్యకరమైన కణ పునరుత్పత్తికి సహాయపడుతుంది. 

4. బరువు తగ్గుదల..  

రాత్రి ఎక్కువగా తిని ఉదయాన అల్పాహారం మానేయటం వలన శరీరంలో క్యాలరీలు తీసుకునే ప్రక్రియ తగ్గుతుంది ఫలితంగా శరీర బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఎక్కువ. 

కానీ ఈ ఫలితాలన్నీ అందరికీ ఉండవు.. కొంత మందిలో ఇవి నష్టాన్ని కూడా చేకూరుస్తాయి.. అవేంటంటే.??

మెటబాలిజం మందగించే అవకాశం

బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వలన కొంతమందిలో మెటాబోలిజం మందగించవచ్చు. అసమతుల్య జీవక్రియ ఫలితంగా శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. 

ఎనర్జీ తగ్గిపోవడం & అలసట.. 

ఉదయాన బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే.. ఆకలి వేయటం సర్వసాధారణం.. ఫలితంగా  శక్తి హీనంగా తయారవ్వటమే కాకుండా అలసటగా మారిపోతారు.. ఇది మీ దినచర్యను ప్రభావిత పరుస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, బాగా శారీరక శ్రమ చేసే వాళ్లకు ఇది ఇబ్బందిగా మారొచ్చు.

అధికంగా తినే అలవాటు పెరిగే ప్రమాదం

ఉదయం తినకపోవడం వల్ల, కొంతమంది మధ్యాహ్నం లేదా రాత్రి చాలా ఎక్కువగా తినే ప్రమాదం ఉంది. దీని వల్ల బరువు పెరగడమే కాక, అజీర్ణం, అసిడిటీ బ్లోటింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్ (Hormonal Imbalance)

కొన్ని పరిశోధనల ప్రకారం, ఉదయం ఆహరం తీసుకొని మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతకు దారితీయొచ్చని నిరూపించబడింది. దీనివలన రుతుక్రమంలో మార్పులు సంభవించవచ్చు. 

ఎవరికి ఇది సరిపోదు..?

డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్ మిస్సవ్వకూడదు.
అధిక ఒత్తిడితో పని చేసే వాళ్లు ఉదయాన తినకపోతే ఏకాగ్రత తగ్గవచ్చు.
గర్భిణీలు & నవజాత శిశువుల తల్లులు అస్సలు తినకుండా ఉండకూడదు.. దీనివల్ల పోషకాహారం సమతుల్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 
అధిక శారీరక శ్రమ చేసే వాళ్లు ఉదయాన తినకపోతే శరీరానికి తగిన శక్తి అందకపోవచ్చు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News