
Good Breakfast For Kids: మీ పిల్లలకు పోషకాలతో నిండిన చక్కటి బ్రేక్ ఫాస్ట్ అందించాలి అనుకుంటున్నారా? అయితే వారికి ఇక్కడ పేర్కొన్నటువంటి టిఫిన్స్ పెట్టడం వల్ల వారు మంచి హైట్ పెరగడంతోపాటు వారికి చక్కటి విటమిన్లు పోషకాలు కూడా లభిస్తాయి.
స్ప్రౌటెడ్ ముంగ్ దోస
మొలకెత్తిన పెసలను పిండిలా మార్చి దోస వేసుకొని తిన్నట్లయితే మీ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో మీకు అమైనో ఆసిడ్స్ కూడా పెద్ద మొత్తంలో లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్స్ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఇది మిమ్మల్ని బయటపడేస్తాయి.
ఓట్స్ , మిల్క్ బౌల్
ఓట్ మీల్ లో మీకు పెద్ద మొత్తంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్ ఉన్నాయి. ముఖ్యంగా ఓట్స్ ను పాలలో కలుపుకొని ఉడకబెట్టి తిన్నట్లయితే మీ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి. అంతేకాదు ఇందులో పెద్ద ఫైబర్ కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది ఇది మీ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభించేలా చేస్తుంది.
గుడ్లు , బ్రౌన్ బ్రెడ్
కోడిగుడ్ల తో పాటు బ్రౌన్ బ్రెడ్ ను కలిపి ఆమ్లెట్ వేసుకొని తిన్నట్లయితే మీ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా బ్రౌన్ బ్రెడ్ లో పోషకాలతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇది మీ జీర్ణశక్తికి ఎంతో అత్యవసరం అని చెప్పవచ్చు. అలాగే గోధుమల్లో ఉండే విటమిన్ డి కూడా మీకు ఎంతో ఉపయోగ అని చెప్పవచ్చు. ఇది ఎముకలు పటిష్టంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కోడిగుడ్లలో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి.
బనానా అండ్ నట్ స్మూథీ
అరటిపండు తో పాటు వేయించిన బాదం అలాగే ఇతర డ్రై ఫ్రూట్స్ కలిపి పాలలో వేసుకొని తాగినట్లయితే ఎంతో రుచికరంగా ఉంటుంది తాగవచ్చు. ఇది మీ శరీరానికి ఎంతో అత్యవసరమైన పోషకాలను అందిస్తాయి అని చెప్పవచ్చు.
ఉల్లిపాయ, మల్టిగ్రెయిన్ రవ్వతో దోశ
ఉల్లిపాయలను సన్నగా తరిమి, అందులో రవ్వ,పెరుగు, కొద్దిగా శనగపిండి కలిపి అందులో మల్టీ గ్రెయిన్ పిండి కలిపి దోస పిండి తయారు చేసుకోవాలి. . ఈ దోశ పిండితో దోశలను వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి అలాగే ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు లభిస్తాయి ఇవి మీ పిల్లలు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని చెప్పవచ్చు.
పనీర్ పరాఠా
పనీర్‌లో ఉన్న ప్రోటీన్ క్యాల్షియం ఎముకల అభివృద్ధికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ పనీర్ ను మైదాపిండి లేదా గోధుమపిండిలో కలిపి పరాటా చేసుకుని తిన్నట్లయితే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇందులో పెద్ద మొత్తంలో ప్రోటీన్లు లభించడం వల్ల పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
మిక్స్డ్ ఫ్రూట్ బౌల్
తాజాగా రకరకాల పండ్ల ముక్కలను కలిపి అందులో చాట్ మసాలా చలి సర్వ్ చేసుకున్నట్లయితే ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ఇందులో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. పండ్ల మొక్కల్లో ఫైబర్ తో పాటు అనే రకరకాల విటమిన్లు కూడా ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook