Ramadan and Diabetes: ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి, జీవనశైలి సక్రమంగా లేకపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మధుమేహం అయితే చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో ఉపవాసాలు ఉండవచ్చా లేదా అనే సందేహం ముస్లింలకు కలుగుతుంటుంది. దానికి సమాధానం తెలుసుకుందాం.
మధుమేహం వ్యాధిగ్రస్తులకు డైట్ అనేది ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండాలి. డైట్ సక్రమంగా ఉంటేనే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డైట్ తేడా అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మారిపోతుంటాయి. మరి మధుమేహంతో బాధపడేవాళ్లు ఉపవాసాలు ఉండవచ్చా లేదా అనేది చాలామందిలో ఉండే సందేహం. ఎందుకంటే రంజాన్ ఉపవాసాలు సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు దాదాపు 14 గంటల మంచి నీళ్లు కూడా తాగకుండా కఠినంగా ఉంటుంది. అలాంటప్పుడు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉపవాసాలు ఉండటం మంచిదా కాదా, ఎలా మేనేజ్ చేయగలరనే ప్రశ్న ఉత్పన్నమౌతుంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా ఉపవాసాలు ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సూర్యోదయం కంటే ముందు తీసుకునే సహరీ డైట్ బ్యాలెన్స్‌గా ఉండాలి. ఇందులో ప్రో బయోటిక్స్ అంటే పెరుగు తప్పనిసరిగా ఉండాలి. దీనివల్ల ఎసిడిటీ తలెత్తదు. పండ్లు , కూరగాయలు, తృణ ధాన్యాలు, రోటీ, పాలు ఉంటే మంచిది. ఇక సాయంత్రం ఇఫ్తార్ సమయంలో షుగర్ ఫ్రీ డ్రింక్స్ మాత్రమే తీసుకోవాలి. ఫ్యాట్ ఎక్కువగా ఉండే సమోసా, కబాబ్, పూరీ వంటివి తినకూడదు. ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, స్కిన్‌లెస్ చికెన్, చేపలు తినవచ్చు. సాధారణంగా ఉపవాసం ఉన్నవారిలో డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు సాయంత్రం ఇఫ్తార్ లో పుచ్చకాయలు, దోసకాయ, రోజ్ డ్రింక్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షిస్తుండాలి.
డైట్ విషయంలో పైన చెప్పిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇక రెండవది, ముఖ్యమైంది తగినంత నిద్ర ఉండాలి. ఉపవాసాలు ఉండేటప్పుడు నిద్ర తక్కువ కాకుండా ఉండాలి. నిద్ర సరిగ్గా ఉంటే జీర్ణక్రియ బాగుంటుంది. అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఎసిడిటీ కడుపు సంబంధిత సమస్యలు ఉండవు. ఈ జాగ్రత్తలు తీసుకున్నంత వరకూ మధుమేహం వ్యాధిగ్రస్తులు రంజాన్ ఉపవాసాలు ఉండవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ మరీ ప్రమాదకరంగా ఉంటే మాత్రం వైద్యుని సలహా తీసుకోవాలి. '
Also read: రంజాన్‌లో హలీం ఎందుకు ప్రత్యేకం, హలీం ఎలా తయారు చేస్తారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









