Haleem Recipe: రంజాన్‌లో హలీం ఎందుకు ప్రత్యేకం, హలీం ఎలా తయారు చేస్తారు

Haleem Recipe: ముస్లింలకు పవిత్రమైన నెల రంజాన్ ప్రారంభమైపోయింది. రంజాన్ అనగానే రుచికరమైన హలీం గుర్తుకొస్తుంది ఎవరికైనా. ఇది రుచిగా ఉండటమే కాకుండా బలవర్ధకమైన ఆహారం. హలీం ప్రత్యేక ఏంటి, ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2025, 11:11 PM IST
Haleem Recipe: రంజాన్‌లో హలీం ఎందుకు ప్రత్యేకం, హలీం ఎలా తయారు చేస్తారు

Haleem Recipe: హలీం. రంజాన్ నెలలో హైదరాబాద్‌లో అత్యంత ప్రాచుర్యమైన ఇఫ్తార్ డిష్. ముస్లింలే కాదు ముస్లిమేతరులు అంతా చాలా ఇష్టంగా తింటారు. హైదరాబాదీ స్పెషల్ హలీంకు దేశ విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇరాన్, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా దేశాల్లో హలీంకు క్రేజ్ ఎక్కువ. హలీం అనేది ఇప్పటి నుంచి కాదు..నిజాం కాలం నుంచి ప్రాచుర్యం పొందుతూ వస్తోంది. 

Add Zee News as a Preferred Source

రంజాన్ నెల వస్తే చాలు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా హలీం స్టాల్స్ దర్శనమిస్తుంటాయి. కొన్నేళ్ళ క్రితం వరకు హైదరాబాద్‌లో మాత్రమే హలీం లభించేది. కానీ హలీంకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఏపీలోని దాదాపు అన్ని పట్టణాలు, నగరాల్లో రంజాన్ నెలలో హలీం స్టాల్స్ వెలుస్తుంటాయి. హైదరాబాద్ నుంచి ప్రతేకంగా కుక్స్‌ని పిలిపించి స్టాల్స్ నిర్వహిస్తుంటారు. ఇది అత్యంత బలవర్ధకమైన ఆహారం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తార్ సమయంలో హలీం తినడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో కేలరీలు చాలా ఎక్కువ. అందుకే ఇది తిన్నప్పుడు ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఇందులో ఉండే ఐరన్, కాల్షియం కారణంగా హిమోగ్లోబిన్ కొరత తీరుతుంది. ఎముకలకు బలం వస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు వికసిస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

హలీం తయారీ ఎలా

హలీం అనేది ఒక నాన్ వెజ్ డిష్. చికెన్ లేదా మటన్ రెండు రూపాల్లో వండుతారు. చికెన్ లేదా మటన్ కావల్సినంత తీసుకోవాలి. గోధుమలు, బార్లీ, కాయధాన్యాలు రాత్రంతా నానబెట్టి ఉంచాలి. చికెన్ లేదా మటన్ చిన్న చిన్న ముక్కలుగా చేసి మసాలా దినుసులు దాదాపుగా అన్నీ వేసి బాగా ఉడికించాలి. ఎంతగా అంటే భారీ చెక్క గరిటెలతో మాంసాన్ని మాష్ చేయాలి. అంటే దాదాపుగా పేస్ట్‌గా చేయాలి. ఇందులో నానబెట్టిన గోధుమలు, బార్లీ, కాయధాన్యాలను మెత్తగా చేసి ఈ మాంసంలో కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసి బాగా కలియబెడుతూ ఉడికించాలి. బాగా చిక్కగా మారిన తరువాత వేడి చల్లారకుండా సర్వ్ చేయాలి. సర్వింగ్‌లో దోరగా వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీర, లెమన్ వేయాలి. అంతే మీకిష్టమైన రుచికరమైన రంజాన్ డిష్ సిద్ధం.

Also read: Ramadan Importance: రంజాన్ ప్రాముఖ్యత ఏంటి, ఉపవాసాలు ఎందుకు ఉంటారు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News