Raw Banana Health Benefits: పచ్చి అరటికాయలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్లు పచ్చి అరటికాయ డైట్లో చేర్చుకోవాలి. రక్తంలో చక్కర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ b6, విటమిన్ సి కూడా ఉంటుంది.
సాధారణంగా ఈ పచ్చి అరటికాయతో కొన్ని రకాల రెసిపీలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇందులో గ్లైసెమిక్ సూచీ (GI) కూడా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ వారు ఇలాంటి రెసిపీలు తయారు చేసుకొని తీసుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ప్రీ బయోటిక్ గుణాలు ఉంటాయి. పేగు ఆరోగ్యానికి మంచిది. మన శరీరానికి తక్షణ శక్తి అందించడమే కాకుండా.. ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక పచ్చి అరటికాయ రెగ్యులర్ గా తీసుకున్న వారిలో మెదడు పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గించి, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. పచ్చి అరటికాయం కూర లేదా స్మూథీ లేదా పిండి రూపంలో కూడా తీసుకుంటారు.
ఈ అరటికాయలో డైటరీ ఫైబర్, గంజీ స్థాయిలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. పేగు ఆరోగ్యానికి మంచిది. దీర్ఘకాలిక మలబద్ధక సమస్య తగ్గించి, ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడతాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ మోతాదులు ఉంటాయి కాబట్టి కడుపునిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. దీంతో అతిగా తినాలని కోరిక కూడా కలగదు. బరువు పెరగకుండా ఉంటారు.
ఇదీ చదవండి: Aadhar Card: మీ పిల్లల ఆధార్ కార్డు పనిచేయదు.. వెంటనే అప్‌డేట్ చేయండి..
మన రెగ్యులర్ డైట్ లో పచ్చి అరటికాయ చేర్చుకోవడం వల్ల ఫైబర్ ఎక్కువ జీఐ మోతాదు తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు మెరుగు చేస్తుంది. పచ్చి అరటికాయలో ఉండే ప్రీ బయోటిక్ కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తూ కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
పచ్చి అరటికాయలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటుని నివారిస్తుంది. ఫైబర్ కూడా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని తగ్గి చేస్తుంది. అంతేకాదు మన ఇమ్యూనిటీని బలపరిచే గుణం పచ్చి అరటికాయకు ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. ఎముకలను బలంగా మారుస్తుంది. అరటికాయలో ఉండే విటమిన్ b6 మెదడు అభివృద్ధికి తోడ్పడి.. అభిజ్ఞ పనితీరును మెరుగు చేస్తుంది. ఇక రెగ్యులర్ డైట్ లో పచ్చి అరటికాయను తీసుకోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: Paneer: పనీర్ ఒక సూపర్‌ఫుడ్.. ఇది తింటే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









