Summer safety tips: వేసవికాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఈ సమయంలో మన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి, సమ్మర్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
వేసవిలో సాధారణంగా కనిపించే కొన్ని ఆరోగ్య సమస్యలు:
వడదెబ్బ (Heatstroke): అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం వేడిని నియంత్రించలేకపోవడం.
లక్షణాలు: తలనొప్పి, వాంతులు, మూర్ఛ, అధిక జ్వరం.
డీహైడ్రేషన్ (Dehydration): శరీరంలో నీటి శాతం తగ్గడం.
లక్షణాలు: తలనొప్పి, అలసట, పొడి చర్మం, మూత్రం తక్కువగా రావడం.
చర్మ సంబంధిత సమస్యలు (Skin problems): వేడి వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, సన్‌బర్న్ వంటి సమస్యలు. ఎండ వేడిమికి చర్మం కమిలిపోవడం.
జీర్ణ సంబంధిత సమస్యలు (Digestive problems): వేడి వల్ల ఆహారం త్వరగా పాడై ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం. మసాలా ఆహారాలను ఎక్కువగా తినడం వలన కూడా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.
కంటి సంబంధిత సమస్యలు (Eye problems): కంటి అలెర్జీలు, కంజక్టివైటిస్ వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి.
కిడ్నీలో రాళ్లు: వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
అలర్జీలు: వేసవిలో వాయు కాలుష్య కారకాల స్థాయిలు పెరగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు చికాకు కలిగి అలర్జీ లక్షణాలు తీవ్రమవుతాయి.
ఫుడ్ పాయిజనింగ్: వేసవిలో ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా,పరాన్నజీవుల పెరుగుదలకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.
సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
నీరు ఎక్కువగా తాగడం: వేసవిలో శరీరం నుంచి చెమట రూపంలో ఎక్కువ నీరు బయటకు పోతుంది. కాబట్టి, డీహైడ్రేషన్ నివారించడానికి రోజంతా తగినంత నీరు తాగాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు కూడా తాగవచ్చును.
తేలికపాటి ఆహారం: వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలా, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
దుస్తులు: వదులుగా, కాటన్ దుస్తులు ధరించాలి. నలుపు రంగు దుస్తులు ధరించరాదు.
ఎండ నుంచి రక్షణ: మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఎండలో తిరగడం తగ్గించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ, సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
శరీరాన్ని చల్లబరచడం: తరచూ చల్లటి నీటితో స్నానం చేయడం లేదా తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం మంచిది.
వ్యాయామం: వేసవిలో వ్యాయామం చేయడం మంచిదే, కానీ ఉదయం లేదా సాయంత్రం చల్లటి వేళల్లో చేయడం మంచిది.
కంటి సంరక్షణ: ఎండలో బయటకు వెళ్లినప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్లను రక్షించుకోవచ్చు.
శరీర పరిశుభ్రత: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి, రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిది.
ఆహార నియమాలు: బయట దొరికే ఆహార పదార్ధాలను తినడం తగ్గించాలి. ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పదార్ధాలను తినడం తగ్గించాలి.
పిల్లల జాగ్రత్తలు:
పిల్లలను ఎండలో ఎక్కువగా తిరగనివ్వరాదు.
వారికి తగినంత నీరు అందిస్తూ ఉండాలి.
వారికి వదులుగా ఉండే కాటన్ దుస్తులను వేయాలి.
వృద్దుల జాగ్రత్తలు:
వృద్దులు ఎండలో తిరగకుండా ఇంట్లోనే ఉండటం మంచిది.
వృద్దులకు ఎక్కువ నీరు తాగిస్తూ ఉండాలి.
అలసటగా అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









