Prevent Pregnancy: యువతకు గుడ్‌న్యూస్‌.. గర్భం రాకుండా శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

Scientists Made New Discoveriy To Prevent Pregnancy: యువతకు భారీ శుభవార్త. లైంగిక వాంఛ తీరాలి కానీ గర్భం రాకూడదని భావించే యువతకు శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. గర్భం రాకుండా ఉండడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణ చేపట్టారు. అదేమిటో తెలుసా?

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 6, 2025, 03:58 PM IST
Prevent Pregnancy: యువతకు గుడ్‌న్యూస్‌.. గర్భం రాకుండా శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

Prevent Pregnancy: ప్రస్తుత సమాజంలో పెళ్లి కాకుండానే శారీరకంగా కలవడం సర్వసాధారణమైంది. గతంలో లైంగికంగా కలవడం అంటే అదో గొప్ప కార్యంగా ఉండేది. ఇద్దరు మనుషులు కలవాలంటే ఎంతో భయం ఉండేది. మారిన పరిస్థితుల్లో పెళ్లికి ముందే శృంగారం అనేది తప్పు అనే భావన తొలగిపోయి.. అది చేయకుంటే అవమానంగా భావించే రోజులు వచ్చాయి. అయితే పెళ్లికి ముందు కలిసే సమయంలో గర్భధారణ అయితే మాత్రం యువత తీవ్రంగా భయాందోళన చెందుతుంది. పెళ్లి కాకుండా గర్భం దాల్చితే కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక అధిక సంతానం వద్దనుకునే వారికి కూడా గర్భధారణ సమస్యగా మారింది. గర్భధారణ కొందరికి సమస్యగా మారగా వాటికి శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారాలు కనుగొన్నారు. గర్భం రాకుండా కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Telugu Hero: హీరోయిన్‌ను గర్భవతిని చేసి మోసానికి పాల్పడ్డ 'తెలుగు స్టార్ హీరో'

గర్భం దాల్చకుండా ఓ ఇంజెక్షన్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వైద్య విధానాలు, మందు మాత్రలు అవసరం లేకుండా గర్భధారణను నివారించడానికి ఒక కొత్త రకం ఇంజెక్షన్‌ను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డీఐవై అని పిలిచే ఈ జబ్ (ఇంజెక్షన్) చర్మం కింద సేకరించబడిన సూక్ష్మ స్ఫటికాలను కలిగి ఉంటుంది. ఫలదీకరణం కోసం స్త్రీ గుడ్లను విడుదల చేయకుండా నిరోధించే హార్మోన్లను ఈ ఇంజెక్షన్‌ ద్వారా విడుదల అవుతాయి. ఈ ప్యాచ్‌లు చర్మం ద్వారా హార్మోన్లను విడుదల చేయడంతో ఇవి గర్భధారణను నివారణకు సహాయపడతాయి.

Also Read: Bandi Sanjay: 'పాలనపై పట్టులేని రేవంత్‌ రెడ్డి రబ్బర్‌ స్టాంప్‌ ముఖ్యమంత్రి'

ప్రస్తుతం గర్భనిరోధక విధానం కొన్ని దశాబ్దాలుగా ఉంది. కానీ ఎలాంటి వైద్య చికిత్స, మందు మాత్రలు లేకుండా గర్భం నిరోధించడానికి గర్భనిరోధక ఇంజెక్షన్‌ కొత్త ఆవిష్కరణగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఇంజెక్షన్‌ మూడు నెలలు మాత్రమే గర్భధారణను నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ కొత్త ఇంజెక్షన్‌పై ప్రయోగాలను ఇంకా మానవులపై పరీక్షించలేదు. శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్‌ మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. వాటి ఫలితాలను మరింత పరిశీలించిన అనంతరం మానవులపై ప్రయోగించే అవకాశం ఉంది. అయితే ఈ ఇంజక్షన్‌ను జంతువులపై ప్రయోగించినట్లు సమాచారం.

అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్‌ను ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకలలో ఈ ఔషధ ప్రభావం కనీసం 97 రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటే ఇంజెక్షన్‌ చేశాక దాదాపు మూడు నెలల వరకు గర్భం రాకుండా నివారిస్తుంది.'ఇంట్లో సులభంగా గర్భ నిరోధానికి ఇంజెక్షన్‌ను ఉపయోగించుకునేలా తయారు చేయడమే మా పరిశోధన లక్ష్యం' అని మసాచుసెట్స్‌ శాస్త్రవేత్త బృందంలోని ఒక శాస్త్రవేత్త తెలిపారు. ఇంజక్షన్‌ తీసుకున్నా తక్కువ నొప్పి కలుగుతుందని చెప్పారు. మరిన్ని ప్రయోగాలు చేస్తే ఈ ఇంజెక్షన్ దీర్ఘకాలికంగా ప్రభావం ఉండేలా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే చట్టబద్ధంగా గర్భ నిరోధకం అనేది కొన్ని దేశాల్లో నేరం. భారతదేశంలో పుట్టబోయే బిడ్డను చంపడం నేరంగా పరిగణిస్తారు. అబార్షన్‌కు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News