
Biggest King Cobra Video Watch:వర్షాకాలంలో పాములు ఎక్కువగా అడవుల్లో కంటే ఇళ్ల పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉంటాయి. అందుకే మిగతా కాలాలతో పోలిస్తే ఎక్కువగా వర్షాకాలంలోనే పాములు బయట కనిపిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో పాములు ఇళ్ళలోకి సంచారం చేసిన అనేక ఘటనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఏకంగా 16 అడుగుల అత్యంత పొడవైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమవడం మీరు చూడొచ్చు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇది ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పార్వతీపురం మాన్యం జిల్లాలో ఓ గ్రామంలో 16 అడుగుల కలిగిన గిరినాగు హల్చల్ చేసింది. అడవి ప్రాంతం నుంచి నేరుగా జనావాసాల్లోకి సంచారం చేసి గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. అయితే గ్రామస్తులు ఈ పాముని వెంటనే చూసి స్నేక్ క్యాచర్స్ కి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి ఈ పామును రెస్క్యూ చేసే కార్యక్రమం చేపట్టాడు. ఇందులో భాగంగానే అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు వారి స్మార్ట్ ఫోన్లలో ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది..
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ముందుగా ఇద్దరు స్నేక్ క్యాచేర్స్ స్నేక్ పట్టుకొని స్టిక్స్ పట్టుకొని ఆ పాము తలభాగం ముందు తోక భాగం ముందు నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఓ స్నేక్ క్యాచర్ పాము తోకను పట్టుకొని లాగడం చూడొచ్చు. ఆ తర్వాత మరో స్నేక్ క్యాచర్ తన చేతిలో బ్యాగును పట్టుకొని పాము తలకు తొడగడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా గమనించవచ్చు. ఈ సమయంలో ఆ పాము ఎంతో ఆగ్రహంగా, యాక్టివ్‌గా వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, వారు ఏమాత్రం భయపడకుండా ఆ పాము తలకు ఓ నలుపు రంగులో సంచిని ఉంచక అది అందులోకి వెళ్లిపోయింది. ఇలా వెళ్లిపోగానే వారు ఆ సంచిని ఓ తాడుతో కట్టి సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. దీంతో ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోనే ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ గా మారింది..
ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతూ ఈ పాము అత్యంత ప్రమాదకరమైందని చెబుతున్నారు. ఈ వీడియో చూసిన కొంత మంది నిపుణులు ఇది అత్యంత ప్రమాదకరమైన గిరినాగని.. దీని కాటు బారిన పడితే మరణం తద్యమని చెబుతున్నారు. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఇలాంటి పాములు ఎక్కువగా సంచారం చేస్తాయని.. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయని వారు చెబుతున్నారు. ఇలాంటి పాములు కనిపిస్తే వాటిని కెలకకుండా.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని వారు తెలుపుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి