COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Snoring Homeo Medicine: ఆధునిక జీవనశైలి పాటించే చాలామందిలో గురక సమస్యలు వస్తున్నాయి. రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు చాలామంది బిగ్గరగా గురక పెడుతూ ఉంటారు. దీని కారణంగా పక్క వారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఈ గురుక సమస్య కారణంగా నిద్రలో అంతరాయం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించే చిట్కాలు కూడా అనుసరించడం మంచిది. ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


గురక రావడానికి కారణాలువేనా?
చాలామందిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెడలోని మృదువైన కణజాలం శ్వాస కోవడం వదలడంలో కంపించడం మొదలవుతుంది. దీంతో మీ గొంతులో నుంచి శబ్దం రావడం ప్రారంభం అవుతుంది. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు.. బయట నుంచి గాలి శరీరంలోకి పీల్చుకున్నప్పుడు శబ్దం రావడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


గురకను తగ్గించడానికి మార్గాలు:
ముక్కుని శుభ్రం చేసుకోవాలి:

కొంతమందిలో ముక్కులో మురికి చేరడం వల్ల రాత్రి పూట గురక రావడం ప్రారంభమవుతుంది. మరి కొంతమందిలో జలుబు, దగ్గు సమయంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే క్రమంలో ముక్కును తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  


శరీర బరువును తగ్గించుకోవాలి:
ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా గురక సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి శరీర బరువులు నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గురక నుంచి ఉపశమనం లభించడానికి వ్యాయామం కూడా తప్పకుండా చేయాలి.


స్లీపింగ్ పొజిషన్‌ కూడా చాలా ఇంపార్టెంట్:
చాలామంది అడ్డంలో పడుకుంటారు. దీని కారణంగా శ్వాసక్రియలో మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీంతో గురక సమస్యలు పెరిగి తీవ్ర వ్యాధులకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి