Soaked Peanuts: 30 రోజుల పాటు నానబెట్టిన వేరుశనగలు తింటే ఏమవుతుందో తెలుసా?

Soaked Peanuts In 30 Days: నానబెట్టిన వేరుశనగలను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలేడు లాభాలు కలుగుతాయి, ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు ఖనిజాలు శరీరానికి అద్భుతమైన శక్తిని అందించేందుకు సహాయపడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 8, 2025, 10:24 PM IST
Soaked Peanuts: 30 రోజుల పాటు నానబెట్టిన వేరుశనగలు తింటే ఏమవుతుందో తెలుసా?

Soaked Peanuts In 30 Days: వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ ఇతర ఖనిజాలు విటమిన్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి అల్పాహారాల్లో భాగంగా చేర్చుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే చాలామంది ఆరోగ్య నిపుణులు ఉడకబెట్టిన వేరుశనగలను ఖాళీ కడుపుతో తినమని చెబుతూ ఉంటారు. నిజానికి ఇలా తినడం మంచిదేనా? ఉడకబెట్టిన వేరుశనగలను ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు లాభాలు కలుపుతాయి. ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు శరీరానికి పూర్తి పోషణ అందిస్తాయని, ఖాళీ కడుపుతో నానబెట్టిన వేరుశెనగ తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సలాడ్స్‌లో భాగంగా వీటిని చేర్చుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇందులో ఉండే పోషకాలు వివిధ రకాల పోషకాల లోపం నుంచి విముక్తి కలిగించేందుకు కూడా సహాయపడతాయి. అయితే 30 రోజులపాటు నానబెట్టిన వేరుశెనగ తినడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

నానబెట్టిన వేరుశెనగ (Soaked Peanuts) రోజు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి పుష్కలమైన ఫైబర్ లభిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడడమే కాకుండా మలబద్ధకం ఇతర సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా నానబెట్టిన పల్లీల్లో అదనంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. ఇవి శరీరానికి అద్భుతమైన శక్తిని అందించేందుకు కీలకపాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామాలతో పాటు జిమ్ చేసేవారు అల్పాహారంలో భాగంగా ఇలా నానబెట్టిన వేరుశెనగ తీసుకుంటే బంపర్ లాభాలు పొందుతారు. అలాగే ఇవి తినడం వల్ల కండరాల పరిమాణాలు కూడా విపరీతంగా పెరుగుతాయి.

ప్రతిరోజు శారీరక శ్రమ చేసేవారు నానబెట్టిన పల్లీలు తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కాబట్టి 60 ఏళ్ల నిండినవారు ప్రతిరోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నానబెట్టిన పల్లెల్లో మెగ్నీషియంతో పాటు బాష్వరం, క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతిరోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు నానబెట్టిన పల్లీలు వరం కంటే ఎక్కువగా భావించవచ్చు. వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి సలాడ్స్ లో వీటిని చేర్చుకోవడం ఎంతో మంచిది. 

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

రోజు ఉదయాన్నే నానబెట్టిన పల్లీలు (Soaked Peanuts) అల్పాహారంగా తీసుకుంటే అనేక రకాల వివిధ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కానీ కొంతమంది వీటిని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పటికే అలర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు నానబెట్టిన వేరుశనగలను తినకపోవడం మంచిదన్నారు. అలాగే ఇప్పటికే కడుపునొప్పి, నీరసం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి పరిస్థితుల్లో వీటిని తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొంతమంది గ్యాస్ట్రిక్ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు కూడా నానబెట్టిన వేరుశనగలను తినడం అంత మంచిది కాదని వారు అంటున్నారు. కాబట్టి ఇప్పటికే కొన్ని పొట్ట సమస్యలతో బాధపడేవారు నానబెట్టిన పల్లీలకు దూరంగా ఉండటం మంచిది.

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News