Star Anise: ఈ పువ్వు ఆడ, మగ ఇద్దరికీ వరం.. చెప్పుకోలేని ఎన్నో వ్యాధులకు చరమగీతం..

Star Anise Health Benefits: స్టార్ అనైజ్ స్టార్ షేప్ లో ఉంటుంది. దీన్ని స్టార్‌ పూవు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఇది చైనా, వియాత్నాం దేశాల్లో ఎక్కువగా పెరుగుతుంది. అయితే స్టార్ అనైజ్ మన దేశంలో కూడా వివిధ వంటలో వినియోగిస్తారు. దీంతో హెర్బల్ టీ కూడా తయారు చేస్తారు. ఇందులో ఎన్నో సాంప్రదాయ మెడిసినల్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.. ఇందులో బయో యాక్టివ్ ఉంటుంది. స్టార్‌ అనైజ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫెనల్స్‌ ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 2, 2025, 04:45 PM IST
Star Anise: ఈ పువ్వు ఆడ, మగ ఇద్దరికీ వరం.. చెప్పుకోలేని ఎన్నో వ్యాధులకు చరమగీతం..

Star Anise Health Benefits: స్టార్ అనైజ్‌ వివిధ వంటల్లో వినియోగిస్తాం. ముఖ్యంగా ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. స్టార్‌ అనైజ్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణ ఆరోగ్యాన్ని మేలు పరుస్తాయి. స్టార్ పువ్వు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పుష్కల పోషకాలు ఉంటాయి. శరీరానికి మేలు చేస్తాయి. ఈరోజు స్టార్ అనైజ్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.. 

Add Zee News as a Preferred Source

స్టార్ అనైజ్ మన ఎన్నో ఏళ్లు సంప్రదాయంలో భాగం. ఇది వివిధ వంటల్లో ముఖ్యంగా నాన్ వెజ్ లో వినియోగిస్తారు. దీంతో టీ కూడా తయారు చేసుకుంటారు. స్టార్‌ అనైజ్‌లో ఔషధ గుణాలు పుష్కలం. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ తొలగిస్తుంది. స్టార్‌ అనైజ్‌లో కార్మినేటివ్ లక్షణాలు కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది

స్టార్ అనైజ్ మన రెగ్యులర్ డైట్‌లో ఉండాలి. ఇందులో లైనూల్‌, విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అంటే ఇది ముఖ్యంగా జలుబు, రొంప సమస్యలకు మంచి ఔషధం అని చెప్పాలి. దీంతో సహజసిద్ధంగా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. హానికర కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది.

రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది ముక్కు శ్వాస నాళాలను క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా జలుబు దగ్గుతూ బ్రోంకైటీస్‌తో బాధపడే వారు స్టార్ అనైజ్ హెర్బల్ తయారు చేసుకొని తీసుకోవాలి. ఇది తక్షణ రెమిడీగా పనిచేస్తుంది.

అంతేకాదు స్టార్ అనైజ్‌ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వకుండా కాపాడుతుంది. షుగర్‌తో బాధపడుతున్న వారు మెటబాలిజం రేటు పెంచుకోవడానికి.. హఠాత్తుగా షుగర్ పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది. స్టార్ అనైజ్‌తో తయారు చేసిన టీ తీసుకోవాలి..

స్టార్ అనైజ్ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య నుంచి కాపాడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు సహజంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. దీంతో కార్డియో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఇదీ చదవండి: చింతపండు ఇలా తీసుకుంటే ఈ వ్యాధులు జన్మలో రావు.. నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..!

స్టార్ అనైజ్ మహిళలకు కూడా వరం. ఇది కడుపులో గ్యాస్ తొలగించేస్తుంది.. నిద్రలేమి సమస్యకు ఇది చక్కని రెమిడీ. తరచుగా ఈ స్టార్‌ అనైజ్‌ తయారు చేసుకుని తీసుకుంటే నిద్ర క్వాలిటీ మెరుగుపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ స్టార్ అనైజ్ తయారుచేసిన టీ తీసుకోవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబ్రియల్‌ గుణాలు ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతే కాదు ముఖంపై యాక్నే రాకుండా నివారిస్తుంది.

ఇదీ చదవండి:  అమ్మ బాబోయ్.. BSNL ఏడాది ప్లాన్ మరీ ఇంత తక్కువ.. ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు బ్రో..  

ముఖ్యంగా యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులోని పాలి ఫైనల్స్, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుందని కొన్ని నివేదికలు తెలిపాయి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కాకుండా కాపాడతాయి. స్టార్ అనైజ్‌ ఒక పవర్‌ఫుల్ మసాలా. ఇందులో ఔషధా గుణాలు పుష్కలం.. కానీ అతిగా తీసుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ముందుగా వీటిని డైట్ చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మేలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News