Stomach Infection: పెరుగు ఇలా కలిపి తిన్నారంటే.. కడుపు ఇన్‌ఫెక్షన్లు ఫసక్‌..

Stomach Infections Remedy:  మీరు తరచూ కడుపు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారా? ఇది బ్యాక్టిరియా వల్ల జరుగుతుంది. ఫలితంగా ఏది తిన్నా డయేరియా, కడుపులో అజీర్తికి దారితీస్తుంది. అయితే పెరుగుతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 13, 2025, 10:59 AM IST
Stomach Infection: పెరుగు ఇలా కలిపి తిన్నారంటే.. కడుపు ఇన్‌ఫెక్షన్లు ఫసక్‌..

Stomach Infections Remedy: కడుపు ఇన్పెక్షన్స్‌తో చాలామంది బాధపడుతుంటారు. ఇది పేగు ఆరోగ్యం కుంటుపడటం వల్ల ఇలా జరుగుతుంది. దీనికి చాలామంది పిల్స్‌, ట్యాబ్లెట్స్‌ వేసుకుంటారు. అయితే, పెరుగుతో కూడా ఈ కడుపు ఇన్పెక్షన్‌కు చెక్‌ పెట్టొచ్చు.

Add Zee News as a Preferred Source

పెరుగు ఎన్నో ఏళ్లుగా వంటల్లో వినియోగిస్తాం. ఇందులో మంచి బ్యాక్టిరియా పెంచే లక్షణాలు ఉంటాయి. పెరుగు ప్రోబయోటిక్‌ ఇందులో మంచి నయం చేసే గుణాలు కూడా ఉంటాయి. అందుకే ప్రతి భారతీయ వంటగదిలో తప్పక పెరుగు ఉండాల్సిందే. 

జీలకర్ర కూడా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇది కడుపులో గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. హానికర బ్యాక్టిరియా కడుపులో పెరగకుండా కాపాడుతుంది. జీలకర్రను మెత్తగా దంచి దాన్ని పెరుగులో వేసుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు సమస్యలు నయం అయిపోతాయి. ఇందులో మీరు  ఫ్లేవర్‌ కోసం తేనె కూడా వేసుకోవచ్చు. 

పెరుగును అల్లంతోపాటు మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కడుపు నొప్పి, గ్యాస్‌ను కూడా తగ్గిస్తుంది. అల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. తాజా అల్లం ముక్కను సన్నగా కట్‌ చేసి పెరుగు, నల్ల ఉప్పు వేసుకుని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం.

దానిమ్మ..
దానిమ్మ పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కడుపు సమస్యలను నయం చేస్తుంది. అంతేకాదు దానిమ్మ పెరుగుతోపాటు కలిపి తీసుకోవడం వల్ల ఉపయోగకరం. ఇందులో కావాలంటే తేనె కలుపుకొని తీసుకోవాలి. త్వరగా ఇన్‌ఫ్లెక్షన్‌ సమస్య నుంచి బయటపడతారు.

ఇదీ చదవండి అన్నీ క్లోజ్‌.. చికెన్‌, మటన్‌ షాపులు బంద్‌ సీపీ ఆనంద్‌ కీలక ఆదేశాలు..  

పసుపు..
పసుపు కూడా జీర్ణ సమస్యలను నయం చేసే గుణం కలిగి ఉంటుంది. కడుపు నొప్పిని కూడా నివారిస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ సెప్టిక్‌ గుణాలు కూడా కలిగి ఉంటాయి.  ఒక గిన్నె పెరుగులో కొద్దిగా పసుపు వేసుకుని తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.

వెల్లుల్లి..
వెల్లుల్లిలో యాంటీ బయోటిక్‌ యాంటీ మైక్రోబ్రియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. దీ్ని పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఇది తోడ్పడుతుంది. ఇందులో ఉప్పు కూడా వేసి తీసుకుంటే రెట్టింపు లాభాలు. జీర్ణశక్తిని పెంచుతుంది.

ఇదీ చదవండితెప్పపై శ్రీ మలయప్ప స్వామి అభయం.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..  
పుదీనా..
ఇందులో కూడా కడుపు ఇన్పెక్షన్‌ తగ్గించే గుణం ఉంటుంది. కూలింగ్ లక్షణాలు పుదీనాలో ఎక్కువే. అజీర్తిని తగ్గించి కడుపులో గ్యాస్‌ను తగ్గిస్తుంది. పేగులో ఉన్న హానికర మైక్రోఆర్గానిజమ్స్‌కు ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది. దీనికి కొన్ని పుదీనా ఆకులను సన్నగా కట్‌ చేసి పెరుగులో కలపాలి. ఇందులో నిమ్మరసం, ఉప్పు కూడా వేసుకుని తీసుకోవాలి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News