Summer Drinks: ఎండ వేడిమిలో డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లలో ఇవి కలుపుకొని తాగండి..

Summer Hydration Drinks: మండు వేసవికాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో తరచూ డిహైడ్రేషన్  గురవుతా ఉంటారు. మన శరీరాన్ని కావలసిన నీరు తాగుతూ ఉండాలి. అయితే డిహైడ్రేషన్ గురి కాకుండా నీళ్లలో ఈ వస్తువులు కలుపుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 6, 2025, 07:08 PM IST
Summer Drinks: ఎండ వేడిమిలో డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లలో ఇవి కలుపుకొని తాగండి..

Summer Hydration Drinks: డీహైడ్రేషన్ గురికాకుండా కొన్ని వస్తువులు నీళ్లలో కలుపుకొని తాగుతూ ఉండటం వల్ల డిహైడ్రేషన్ గురికాకుండా ఉంటారు. ఇవి సహజమైన ఎలక్ట్రోలైట్స్ గా పనిచేస్తాయి. డిహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతాయిజ.

Add Zee News as a Preferred Source

కీర దోసకాయ.. 
కీరదోసకాయను నీళ్లలో కలుపుకొని తాగటం వల్ల మేలు జరుగుతుంది. ఇందులో 90% పైగా నీరు ఉంటుంది. మంచి హైడ్రేషన్ అనిపిస్తుంది. ఇవి మన శరీరంలో పీహెచ్‌ స్థాయిలు సమతులం చేస్తుంది. కీరదోసకాయ స్లైసులుగా కట్‌ చేసి నీళ్లలో కలుపుకుని తాగుతూ ఉండాలి. డిహైడ్రేషన్  గురికాకుండా ఉంటారు.

నిమ్మకాయ..
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ స్థాయిలను కూడా బలపరుస్తుంది. అంతేకాదు పీహెచ్ స్థాయిలను కూడా సమతులం చేస్తుంది. ఇది మంచి డిటాక్స్ డ్రింక్‌ లాగా పని చేస్తుంది. మన శరీరంలో నుంచి విష పదార్థాలు బయటికి పంపించేసి చలదనాన్ని మన శరీరానికి అందిస్తుంది.

పుదీనా ఆకులు..
పుదీనా ఆకులు డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి తాజాదనం అందుతుంది. ఎండాకాలం శరీరంలో వేడి తగ్గిస్తుంది. పుదీనా ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎండాకాలం తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ గురికాకుండా కాపాడుతుంది. నీళ్లలో కలుపుకొని వీటిని తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మన శరీరానికి అందుతుంది. 

చియా విత్తనాలు..
ఎండాకాలం చాలామంది జియో విత్తనాలు నీళ్లలో కలుపుకొని తీసుకుంటారు. వీటిని తీసుకోవటం వల్ల హైడ్రేషన్‌ మన శరీరానికి అందుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో కూడా చీయ విత్తనాలు యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలు శరీరారోగ్యానికి మేలు చేస్తాయి. ఒక చెంచా చియ విత్తనాలను ప్రతిరోజు నీళ్లలో కలుపుకొని తీసుకోవటం వల్ల మన శరీరాన్ని కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. అంతేకాదు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది.

ఇదీ చదవండి:   Sesame Seeds: ప్రతిరోజు నువ్వులు తీసుకుంటే నమ్మలేని 7 అద్భుతమైన ప్రయోజనాలు..

ఇదీ చదవండి:  అత్తపై కోడలి దాష్టీకం.. వృద్ధాశ్రమానికి వెళ్లలేదని.. వీడియో వైరల్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News