Tomato Juice: పరగడుపున టమాటా జ్యూస్‌ తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే..

Tomato Juice Benefits:  టమాటా జ్యూస్‌ దక్షిణ భారతదేశంలో ఒక ప్రసిద్ధ రెసిపీ. ఇది రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది టమోటాలతో తయారు చేస్తారు. కాబట్టి ఇది ఆరోగ్యానికి  ఎంతో మంచిది. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Mar 9, 2025, 01:28 PM IST
Tomato Juice: పరగడుపున టమాటా జ్యూస్‌ తాగడం వల్ల కలిగే లాభాలు ఇవే..

Tomato Juice Benefits: టమాటా.. నిత్యం మన ఇంట్లో కనపడుతూ.. దాదాపు ఏ కర్రీలో అయిన వాడుకునే కూరగాయ. ఎర్రగా నిగ నిగ లాడే టమాటాను కొంత మంది పచ్చిగా కూడా తింటూ ఉంటారు. టమాటాలో పుష్కలమైన యాంటీ ఆస్కిడెంట్లు, విటమిన్ A,C,K  పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. 

Add Zee News as a Preferred Source

వీటిలో ఉండే ఈ పోషకాల కారణంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన మలినాలన్నిటిని బయటకు పంపివేస్తోంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన టమాటాను జ్యూస్ గా..  అది కూడా ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. 

పరగడుపున టమాటా రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణవ్యవస్థలో మెరుగుదల

పరగడుపున టమాటా రసం తాగడం వలన జీర్ణ సంబంధిత సమస్యలన్నీ ఇట్టే  తగ్గించేస్తుంది. టమోటాలో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థలోని జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేసి.. జీర్ణ వ్యవస్థపై భారం పడకుండా చూస్తుంది. అంతేకాకుండా.. ఉదయాన్నే పరగడుపున  టమాటా జ్యూస్‌ తాగటం వలన అజీర్ణం, అసిడిటీ  ఇతరేతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

డిటాక్సిఫికేషన్

డిటాక్సిఫికేషన్ అనగా.. పేరుకుపోయిన విషపదార్థాలను, మలినాలను శరీరం నుండి బయటకు పంపే ప్రక్రియ. పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగిన టమాటాను రోజు  పరగడుపున తాగటం వలన శరీరంలోని విషాలను మలిన పదార్థాలను బయటకు పంపి వేస్తుంది. అంతేకాకుండా.. కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి, అవయవాల శుద్ధిని చేయటంలో ఇవి దోహదపడతాయి. 

ఆరోగ్యమైన గుండె 

మనం రోజు కూరల్లో వాడే టమాటాలలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండెకు మంచి రక్షణను అందిస్తుంది. అంతేకాకుండా.. శరీర రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించి.. రక్త ప్రసరణను మెరుగుపరచి.. రక్తపోటును తగ్గిస్తుంది.

చర్మానికి మెరుగైన ఆరోగ్యం

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉండే విటమిన్ C, విటమిన్ Aలు టమాటాల్లో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా చర్మంపై మచ్చలు, మొటిమలు తగ్గించేందుకు సహాయపడతాయి. పరగడుపున  టమాటా జ్యూస్‌ తాగటం వలన కేవలం వారం రోజుల్లో మీ చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. 

ఇతరేతర ప్రయోజనాలు.. 

 టమాటా జ్యూస్‌లో ఉండే విటమిన్ A కళ్లకు మంచిది. టమోటా జ్యూస్ ను రోజు తాగటం వలన రాత్రి కంటి చూపు మెరుగుపడుతుంది. టమాటా రసం శరీరంలోని నీటి సమతుల్యతను నియంత్రించి.. రోజంతా ఉత్తేజంగా ఉంచటంలో సహాయపడుతుంది. 

ఎలా తాగాలి.. ?

టమాటా జ్యూస్ తయారీకి తాజా లేదా ఫ్రెష్ గా ఉన్న టమోటాలను తీసుకొని.. గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. టమోటా జ్యూస్ ను రోజు తాగిన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. 

ఎవరు  తాగకూడదు.. ?

ఇదివరకే గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ ఉన్నవారు ఎక్కువగ్గా తాగటం మంచిది కాదు. ఒకవేళ  కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం  టమాటా జ్యూస్‌ తాగటానికి ముందుగా తప్పక డాక్టర్ సలహా తీసుకోవాలి.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News