Anti Cancer 10 Foods: ఈ 10 ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే కేన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ప్రధానంగా ఇవి బ్రెస్ట్ కేన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా సహాయపడతాయి. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
బెర్రీలు..
బెర్రీ జాతికి చెందిన ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కేన్సర్ బారిన పడకుండా ఉంటారు. ప్రధానంగా బ్లూబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్ బెర్రీలు మన డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఎల్లాజిక్ యాసిడ్, ఆంథోనిసైనిన్స్ ఉంటాయి. కణాలను ఆరోగ్యంగా ఉండేలా ప్రేరేపిస్తాయి.
గ్రీన్ టీ..
గ్రీన్ టీ లో కూడా కెటాచిన్ ఉంటుంది. ఇందులో ఎపిగల్లోకెటాచిన్ 3 ఉంటుంది. ఇది కేన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. తద్వారా బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం కూడా తగ్గిపోతుంది.
క్రూసిఫెరస్ కూరగాయ..
క్రూసిఫెరస్ జాతికి చెందిన కూరగాయలు మన డైట్‌లో చేర్చుకోవాలి. ప్రధానంగా క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రస్సెల్ స్ప్రౌట్స్ వంటివి తినాలి. ఈ కూరగాయలు కూడా యాంటీ కేన్సర్ కూరగాయలుగా పనిచేస్తాయి.
కొవ్వు చేప..
కొవ్వు చేప ప్రధానంగా సాల్మాన్, మెకరాల్, సార్డైన్స్ చేపలు తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతేకాదు ఈ చేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. దీంతో బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం కూడా తగ్గిపోతుంది.
వెల్లుల్లి..
వెల్లుల్లి కూడా ప్రతిరోజూ మన డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా మనకు కేన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు వెల్లుల్లి కేన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..
టమోటాలు..
టమోటాల్లో లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కేన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. టమోటాలతో సూప్స్, సలాడ్స్, కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు.
అవిసె గింజలు..
అవిసె గింజల్లో కూడా లిగనాన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది బ్రెస్ట్ కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
సోయా ఫుడ్స్..
సోయా ఫుడ్స్ అంటే ప్రధానంగా తోఫు, ఎడమేమ్ గింజల్లో ఫైటోఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇది హర్మోన్‌కు సంబంధించిన కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
పసుపు..
పసుపు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తాం. వంటల్లో పసుపునకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కేన్సర్ గుణాలు ఉంటాయి. ఇది కూడా బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆకుకూరలు..
పాలకూర, కాలే వంటి ఆకుకూరలు డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అయిన కెరోటెనాయిడ్స్ ఉంటాయి. బ్రెస్ట్ కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.
ఇదీ చదవండి: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









