Top 10 Iron Rich Foods: ఐరన్ లేమితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఐరన్ పుష్కలంగా ఉంటేనే కండరాల ఆరోగ్యం మెటబాలిజం రేటు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. అయితే ఐరన్ పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవి పిల్లలకు, మహిళలకు ఎంతో మంచిది. అలాంటి ఆహారాలు తెలుసుకుందాం.
షెల్ ఫిష్..
షెల్ ఫిష్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవాలి.. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. షెల్ ఫిష్ మహిళలు, పిల్లవాళ్ళు ప్రధానంగా తినాలి.
గుడ్లు..
గుడ్లలో డైటరీ ఐరన్ ఉంటుంది. ఇందులో ఐరన్ ఉండటం వల్ల మంచి ఫుడ్. గుడ్లలో విటమిన్ సి కూడా ఉంటుంది. గుడ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. అంతేకాదు ఇందులో విటమిన్ డీ కూడా ఉంటుంది.
పాలకూర ..
పాలకూర పోషకాలకు పవర్ హౌస్. ఇందులో కూడా ఐరన్ పుష్కలం. ప్రధానంగా పాలకూరలో కెరటానాయిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు పాలకూర ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు పాలకూర తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లో పాలకూర కలిపి తీసుకోవడం వల్ల మంచిది.
శనగలు..
శనగల్లో కూడా ఐరన్ పుష్కలం. ఒక కప్పు శనగల్లో 1.5 మిల్లీగ్రామ్ ఐరన్ అందుతుంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ కూడా కలిగి ఉండటం వల్ల మంచిది. సలాడ్, పాస్తా, సూప్స్లలో ఈ చిక్ పీస్ వేసుకొని తీసుకోవాలి ఇవి రుచికరంగా కూడా ఉంటాయి.
గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజల్లో కూడా ఐరన్ పుష్కలం, దీని సాంబార్లో వేసుకొని తీసుకుంటారు.. అయితే కొన్ని రకాల సలాడ్స్‌లో కూడా వేసుకొని తీసుకోవచ్చు.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మహిళలు పిల్లలకు వరం వంటిది.
తోఫు..
తోఫులో కూడా ఐరన్ పుష్కలం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం కూడా ఉంటుంది. వీటిని సలాడ్, శాండ్విచ్‌లో వేసుకొని తింటారు.
ఇదీ చదవండి: AP SSC 2025: రేపటి నుంచే పదో తరగతి ఎగ్జామ్స్.. బస్సు ప్రయాణం ఫ్రీ..
డార్క్ చాక్లెట్ ..
ఇవి కాకుండా డార్క్ చాక్లెట్ లో కూడా ఖనిజాలు పుష్కలం. వీటితో పాటు ఐరన్ ఉంటుంది. ప్రీ బయోటిక్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడతాయి. గుండె ప్రమాదాలను దూరంగా ఉంచుతాయి.
క్వినోవా..
క్వినోవా ఈ మధ్యకాలంలో చాలామంది డైట్ లో చేర్చుకుంటున్నారు. ఇందులో ప్రోటీన్ మన శరీరాన్ని కావలసిన ఫోలేట్, మెగ్నీషియం కూడా ఉంటుంది. సమతుల ఆహారం అవుతుంది. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది.
నువ్వులు..
నువ్వులు మన వంట గదిలో ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మహిళలకు తగిన శక్తి, ఐరన్ అందుతుంది. ఇందులో రాగి, పాస్పరస్ కూడా ఉంటుంది. ఏదైనా ఆహారలో నువ్వులను కలిపి తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈ రాశులు విజయ ఢంకా మోగించడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









