Bad Cholesterol Reducing Food: సాధారణంగా మన శరీరంలో రెండు రకాల కొవ్వు పదార్థాలు ఉంటాయి.. అది ఒకటి మంచి కొలెస్ట్రాల్ (HDL) రెండోది చెడు కొలెస్ట్రాల్ (LDL). మంచి కొలెస్ట్రాల్ వలన ఆరోగ్యానికి ఏ హాని ఉండదు కానీ.. ఒకవేళ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. ఎక్కువగా ఒకే చోట కూర్చొని పని చేసే వారిలో, జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వారిలో మద్యం, సిగరెట్ వంటి అలవాట్లు ఉన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు వెంటనే చెడు కొలెస్ట్రాల్ ను పెంచే అలవాట్లని మాని.. మంచి ఆరోగ్యకర జీవన శైలిని పాటించటం మంచిది. అంతేకాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను తగ్గించి మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను రెట్టింపు చేస్తాయి. వాటి గురించి ఇపుడు తెలుసుకుందాం..
ఓట్స్ & తృణధాన్యాలు:
ఓట్స్‌లో బీటా గ్లుకాన్ అనే ఫైబర్ పదార్థం అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, బార్లీ, గోధుమ రవ్వ, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను ఎక్కువగా డైట్ లో చేర్చుకోవటం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గు ముఖం పడతాయి. .
నట్స్:
బాదం, వాల్‌నట్, పిస్తా, పీనట్ వంటి గింజలలో ఓమేగా-3 యాసిడ్స్, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
అవకాడో:
అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది LDL స్థాయిని తగ్గించి, HDL స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. రోజుకు ఒక అవోకాడో తింటే మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది.
ఫ్రూట్స్:
ఆపిల్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ద్రాక్ష వంటి పండ్లు, సిట్రస్ ఎక్కువగా కలిగి ఉండే నిమ్మ, మోసంబి, ఆరంజ్ లాంటివి పెక్టిన్ అనే ఫైబర్ ని ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇది LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి, HDL కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
చేపలు;
కొన్ని రకాల చేపలు ఓమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ లను అధికంగా కలిగి ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సాల్మన్, మ్యాకరెల్, ట్యూనా, సార్డైన్ వంటి చేపలలో ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, మంచి కొలెస్ట్రాల్ లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని LDL స్థాయిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజు మనం తినే ఆహార పదార్థాలు తయారీకి సాధ్యమైనంత వరకు ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
గ్రీన్ టీ:
గ్రీన్ లో టీ యాంటీ ఆక్సిడెంట్లు, క్యాటెచిన్స్ అధికంగా కలిగి ఉంటుంది. వీటిలో ఉండే ఈ మూలకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. రోజుకు ఒక లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









