)
Kidney Cleanses 5 Foods: కిడ్నీల ఆరోగ్యం కోసం ఎప్పుడూ డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటారు. దీనివల్ల మీ కిడ్నీలు పాడవ్వకుండా ఉంటాయి. కొన్ని రకాల ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగు కూడా అవుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. వీటిని తీసుకుంటే మీ కిడ్నీలు డిటాక్స్ అవుతాయి. ఆ జాబితా తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు..
కొన్ని రకాల సిట్రస్ పండ్లు రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే కిడ్నీలు డిటాక్స్ అయిపోతాయి. ప్రధానంగా నిమ్మకాయ, ఆరెంజ్ వంటివి రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి హైడ్రేషన్ అందించడంతోపాటు శరీరంలోని విషపదార్థాలు సైతం బయటకు పోతాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ శాతం సిట్రేట్ ఉంటుంది. ఇవి కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడుకుండా కూడా కాపాడతాయి. ఈ సిట్రస్ పండ్లు రెగ్యులర్‌గా తీసుకుంటే మీ యూరిన్‌లో సిట్రీక్ స్థాయిలు కూడా తగ్గుతాయి. మీ కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
ఆరెంజ్ కూడా రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇవి కూడా కిడ్నీల పనితీరును కూడా మెరుగు చేస్తాయి. మీ రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణం వీటిలో ఉంటాయి. ఆరెంజ్ పండు తింటే మీ మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరెంజ్ తింటే కిడ్నీలు పాడవ్వకుంటా ఉంటాయి.
కీర దోసకాయ..
కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఇవి కిడ్నీల పనితీరును కూడా మెరుగు చేస్తాయి. కీర దోసకాయ డైరుటిక్ గుణాలు కూడా కలిగి ఉంటాయి. నీటి శాతం అధికంగా ఉండే కీరదోసకాయ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుకుండా చేస్తుంది. తద్వారా కిడ్నీల పనితీరు కూడా మెరుగు చేస్తుంది. కీరదోసకాయ రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది. కీర జ్యూస్ లేదా సలాడ్ తీసుకుంటూ ఉండాలి.
సెలరీ..
సెలరీలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో కూడా నేచురల్ డెరుటిక్ గుణాలు ఉంటాయి. ఇది యూరిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. సెలరీలో విష పదార్థాలు కూడా టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది. సెలరీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరం కూడా
నీళ్లు..
రెగ్యులర్‌గా నీళ్లు ఎక్కువమోతాదులో తీసుకుంటూ ఉండండి. ఇది కిడ్నీలను డిటాక్స్ చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కూడా చేస్తుంది. మన శరీరంలోని విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది.
కొవ్వు చేప..
కొవ్వు చేపలు అయిన సాల్మాన్, ట్యూనాలు కూడా కిడ్నీల పనితీరుకు సహాయపడతాయి. కొన్ని నివేదికల ప్రకారం ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రక్తపోటును కూడా ఈ కొవ్వు చేపలు తగ్గిస్తాయి.సహజంగా కిడ్నీలను కాపాడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook