Vegetables Must Not Take In Winter: చలికాలం వచ్చిందంటే చాలు ఇమ్యూనిటీ స్థాయిలు తగ్గిపోతాయి. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా ఎలాంటి రోగాలతో అయినా పోరాడే సామర్థ్యం లభిస్తుంది. ఏ సీజన్‌లో అయినా మనం తీసుకునే ఆహారాల్లో విటమిన్స్‌, మినరల్స్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉండేవి తినాలి. అయితే, చలికాలంలో మన జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి సులభంగా జీర్ణం అయ్యే ఆహారాలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు అలాంటి ఆహారలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలకూర..
పాలకూర చలికాలంలో తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది పాలకూరలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇది మంచి సూపర్ ఫుడ్ పాలకూరతో వివిధ కూరలు సలాడ్ రూపంలో తీసుకోవచ్చు..


మెంతి ఆకులు...
మెంతి ఆకుల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. రక్తంలో చక్కెర లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది...ఈ ఆకులను కూరలాగా తీసుకోవచ్చు లేకపోతే చపాతీలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు.


క్యారెట్లు..
క్యారెట్లు డైట్లో చేర్చుకోవడం వల్ల విటమిన్ ఏ అందుతుంది. ఇది మన కంటికి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.. క్యారెట్ చలికాలం తప్పకుండా తీసుకోవాలి. ఇది మంచి సూపర్ ఫుడ్. క్యారెట్ తీసుకో జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. వంటల్లో కూడా వినియోగించవచ్చు


క్యాలీఫ్లవర్..
క్యాలీఫ్లవర్ లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలం తీసుకోవడం వల్ల సీజనల్ జబ్బులు మీ దరి చేరకుండా ఉంటాయి... క్యాలీఫ్లవర్ తో వివిధ వంటకాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉడికించి తీసుకోవాలి.


గ్రీన్ పీస్...
గ్రీన్ పీస్ లో కూడా పోషకాలు పుష్కలం. గ్రీన్‌ పీస్‌లో ఇమ్యూనిటీ గుణాలు ఉంటాయి.అంతేకాదు ఇందులో ఖనిజాలు కూడా పుష్కలం గ్రీన్ పీసిన వంటల్లో వినియోగించవచ్చు.. నేరుగా సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.. గ్రీన్ పీస్ లో రెండు రకాలు కూడా ఉంటాయి. ఫ్రోజెన్‌ గ్రీన్‌ పీస్‌ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


ఇదీ చదవండి: ఈ 4 డిటాక్స్ డ్రింక్స్ తాగితే ఢిల్లీ కాలుష్యంలో కూడా మీ ఊపిరితిత్తులు హెల్తీగా ఉంటాయి..


బీట్రూట్..
బీట్రూట్ కూడా మంచిది.  ఇది మంచి శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బీట్రూట్ జ్యూస్  రూపంలో తీసుకోవచ్చు, సలాడ్ల కూడా తినవచ్చు.. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కాదు అందానికి మేలు చేస్తుంది.. స్కిన్ ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.


బ్రోకోలి..
బ్రోకోలిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.. క్యాలీఫ్లవర్ మాదిరి బ్రోకలీకూరని కూడా వండుకోవచ్చు. ఇది కూడా క్రూసీపేరస్ జాతికి చెందిన కూరగాయ.. చలికాలం బ్రొకోలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. బ్రోకర్లు తరచుగా తీసుకునే వారిలో చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.


ఇదీ చదవండి: ఈ 3 కొవ్వును కట్ చేసే కిచెన్ వస్తువులు.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెడతాయి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.