Weight Loss Vegetable: మీ పొట్టను ఇలా బెలున్‌లో గాలీ తీసినంత సులభంగా కేవలం 8 రోజుల్లో తగ్గించుకోవచ్చు..
Vegetables To Reduce Belly Fat In 8 Days: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయితే పెరుగుతున్న బరువు సులభంగా నియంత్రించుకోవడానికి ఇలా చేయండి..
Vegetables To Reduce Belly Fat In 8 Days: బరువు తగ్గడం చాలా కష్టమైన పని. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి కేలరీలు అధికంగా ఉండే ఆహారాలను వదిలి ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గే క్రమంలో తప్పకుండా పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డైట్ పాటించడం వల్ల కూడా స్థూలకాయం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే తప్పకుండా ఈ డైట్‌ను అనుసరించే క్రమంలో తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
బరువు తగ్గడానికి తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో తప్పకుండా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తినొచ్చు. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో తప్పకుండా ఆకు కూరలు, కూరగాయాలు తీసుకోవాలి. ఇలా ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి తప్పకుండా బరువు సులభంగా తగ్గడానికి ఇలాంటి ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బ్రోకలీ:
ఈ ఆకుపచ్చ కూరగాయలలో ఫైబర్, విటమిన్ సి రెండూ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు బ్రోకలీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ అందుతుంది. అయితే ఒక కప్పు బ్రోకలీలో ఐదు గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పాలకూర:
పాలకూర కంటికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తసుకుంటే కంటికే కాకుండా బరువు తగ్గాలనుకునేవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో రక్తపోటును నియంత్రించే గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో కరిగే ఫైబర్ అధక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బరువును సులభంగా తగ్గిస్తుంది.
ఆకుపచ్చ బటానీలు:
పచ్చి బఠానీలు శరీరానికి చాలా రకాలగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గించి శరీరాన్ని దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
బెండకాయ:
బెండకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాల్షియం, పొటాషియం, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఎంజైములు వీటిలో లభిస్తాయి. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకుంటే సులభంగా బరువు తగ్గడమే కాకుండా మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook